జిల్లా ఎయిడ్స్ నియంత్రణాదికారి డా. అనుపమ జేమ్స్
విశాలాంధ్ర – అనంతపురం : విద్యార్థి దశ నుంచి హెచ్‌ఐవి ఎయిడ్స్ మరియు ఇతర రోగాల పట్ల అవగాహన పెంచుకోవాలి అని జిల్లా ఎయిడ్స్ నియంత్రణాదికారి డా. అనుపమ జేమ్స్ అన్నారు . శుక్రవారం జిల్లా స్థాయి క్విజ్ పోటీలు స్థానిక రాజేంద్ర మున్సిపల్ హై స్కూల్ నందు జరిగినవి . యూత్ ఫెస్ట్ 2024-25 లో యువతలో హెచ్‌ఐవి ఎయిడ్స్ పై అవగాహన లో బాగంగా మండల స్థాయిలో 8,9 వ తరగతుల విద్యార్థినీ విద్యార్థులకు జరిగిన క్విజ్ పోటీలలో ప్రథమ, ద్వితీయ స్థాయి విజేతలు జిల్లా స్థాయి క్విజ్ పోటీలలో పాల్గొన్నారు.
ఈ జిల్లా స్థాయి క్విజ్ పోటీలలో ప్రథమ విజేతలుగా సర్వే పల్లి రాధ కృష్ణ మున్సిపల్ హై స్కూల్ , గుంతకల్ విద్యార్థిని నందిత మరియు ఎస్ .జె .పి .హై స్కూల్ , గుంతకల్ విద్యార్థిని మధిహా ఇమాన్, ద్వితీయ స్థాయి విజేతలుగా ఏపీ మోడల్ స్కూల్,పామిడి విద్యార్థులు మహీదర్, సంపత్ కుమార్ , తృతీయ స్థానం లో డా. అంబేద్కర్ గురుకులం, కొర్రపాడు విద్యార్థినులు శిరీష, భవిష్య గెలుపొందారు . ఈ క్విజ్ పోటీలలో గెలుపొందిన విద్యార్థినీ విద్యార్థులకు నగదు బహుమతులు మరియు ప్రసంశ పత్రాలు అందజేశారు. జిల్లా స్థాయి క్విజ్ పోటీలలో గెలుపొందిన ప్రథమ, ద్వితీయ విజేతలు 6 సెప్టెంబరు 2024 న జరిగే రాష్ట స్థాయి పోటీలకు ఎంపికయ్యారు.ఈ కార్యక్రమం లో ఉప జిల్లా విద్యాధికారి శ్రీనివాస రావు,క్లస్టర్ ప్రోగ్రామ్ మేనేజర్ వి. బాస్కర్ ,జిల్లా సూపర్వైసర్ జి .వి .రమణ, ప్రదాన ఉపాద్యాయులు రామాంజినేయులు , జిల్లా ఎయిడ్స్ నియంత్రణ అదికారులు మురళి మోహన్, నారాయణ స్వామి, రిడ్స్ నరేష్ మరియు వివిద పాఠశాలల ఉపాద్యాయులు, విద్యార్థినీ విద్యార్థులు పాల్గొన్నారు .