విశాలాంధ్ర -ఉరవకొండ (అనంతపురం జిల్లా) : దళిత గిరిజనుల హక్కుల సాధన సమితి రాష్ట్ర అధ్యక్షులు బి. సాకే రమేష్ ను ఏకగ్రీవంగా ఎంపిక చేసినట్లు సమితి వ్యవస్థాపక అధ్యక్షులు మీనగా గోపాల్ తెలిపారు. గురువారం ఉరవకొండ పట్టణంలో హక్కుల సాధన సమితి సమావేశాన్ని నిర్వహించడం జరిగిందని ఈ సమావేశంలో నూతన అధ్యక్షుని ఎంపిక చేశామని తెలిపారు. సంఘం బలోపేతం చేయుటలో భాగంగా అన్ని జిల్లాల ప్రజలకు దగ్గర కావాలనే ఉద్దేశంతో కమిటీలను ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. నూతన రాష్ట్ర అధ్యక్షులు సాకే రమేష్ మాట్లాడుతూ భవిష్యత్తులో ప్రజలకు అందుబాటు లో ఉంటూ నా వంతు సహాయ సహకారాలు అందిస్తూ సంఘం కట్టుబాట్లకు అనుగుణంగా నడుచుకుంటానని, అలాగే అన్ని జిల్లాల వారీగా అధ్యక్షులను ఎంపిక చేసి సంఘాన్ని బపలోపేతం చేస్తానని తెలిపారు. ఈ కార్యక్రమంలో వ్యాసాపురం మహేష్, వెలుగొండ నాగరాజు,రాయంపల్లి రాజేష్ చాబాల నరేంద్ర తదితరులు పాల్గొన్నారు.