నిధులు లేకున్నా బద్దే నాయక్ మిత్రుడు NRI ద్వారా బాధిత కుటుంబానికి రూ.2లక్షల ఆర్థిక సాయం.
విశాలాంధ్ర- శెట్టూరు : ఆపదలో ఉన్న కుటుంబాలకు అండగా నిలుస్తున్న ఇన్ఫినిటీ చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ బద్దే నాయక్ ఇన్ఫినిటీ చారిటబుల్ ట్రస్ట్ లో నిధులు లేకున్నా ఎన్నారై మిత్రుడు ద్వారా బాధిత కుటుంబానికి ఆర్థిక సాయం అందించారు శుక్రవారం మండలం పరిధిలో
కైరేవు గ్రామానికి చెందిన మహేష్ (36)అనారోగ్యంతో వారం క్రితం మరణించారు కుటుంబ పెద్ద మరణించాక వారి కుటుంబం చాలా దయనీయ స్థితిలో ఉంది ఇతనికి ముగ్గురు పిల్లలు ఉన్నారు కుటుంబాన్ని ఆదుకోవాలని ఇన్ఫినిటీ చారిటబుల్ ట్రస్ట్ ను గ్రామస్తులు విన్నవించగా ట్రస్ట్ వారు ఎన్నారై ద్వారా వీరి కుటుంబ పరిస్థితులను వివరించగా మీ ట్రస్ట్ కార్యక్రమాలు నిరంతరం చూస్తుంటానని తప్పకుండా సహాయం చేద్దామని ఆ కుటుంబాన్ని ఆదుకోవడానికి 2లక్షలు ఇవ్వడానికి ముందుకొచ్చారు వారు తెలిపారు. 2లక్షలు మహేష్ గారి కూతురైన జాహ్నవి పేరుమీద పోస్ట్ ఆఫీస్ లో 5ఏళ్ళ కాలానికి డిపాజిట్ చేయించి కుటుంబ సభ్యులకు ఖాతా పుస్తకాలను గ్రామస్తుల సమక్షంలో ఇన్ఫినిటీ చారిటబుల్ ట్రస్ట్ ఛైర్మెన్ బద్దేనాయక్ అందించారు గ్రామస్తులు కుటుంబ సభ్యులు టీం సభ్యులందరికీ ప్రత్యేక అభినందనలు తెలియజేశారు ఈ కార్యక్రమంలో ట్రస్ట్ వైస్ ఛైర్మెన్ సురేష్ అబ్దుల్ వాహబ్, ఎమ్మెస్ రాయుడు తిప్పేస్వామి, సాయి తిమ్మరాజు గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు