— జిల్లా ఎస్పీ పి.జగదీష్
విశాలాంధ్ర – అనంతపురం : ఫెడ్ ఎక్స్ కొరియర్ సర్వీస్ పేరిట జరుగుతున్న సైబర్ నేరాల పట్ల అప్రమత్తంగా ఉండాలని జిల్లా ఎస్పీ శ్రీ పి.జగదీష్ విజ్ఞప్తి చేశారు. ఇటీవల అక్కడక్కడ జరుగుతున్న ఫెడ్ ఎక్స్ కొరియర్ సర్వీస్ నేరాల పట్ల అవగాహన చేస్తూ జిల్లా ఎస్పీ శుక్రవారం పత్రికా ప్రకటన విడుదల చేశారు…
ముందుగా అపరిచితుల నుండీ ఫోన్ కాల్ మీ మొబైల్ ఫోన్ కు వస్తుంది. అవతలి వ్యక్తి విదేశాల నుండీ ఫోన్ చేస్తున్నానని నమ్మబలుకుతూ మాటలు కలిపేస్తాడు. మిమ్మల్ని ఆకట్టుకునేలా ఫోన్ సంభాషణలో నటించి ఆ కాల్ అంతటితో కట్ చేసేస్తాడు. ఇంకో అపరిచిత నంబర్ నుండీ ఫెడ్ ఎక్స్ కొరియర్ సర్వీస్ నుంచి ఫోన్ చేస్తున్నామని పరిచయం చేసుకుంటారు. మీ పేరు మీద ఒక పార్సెల్ వచ్చిందని చెప్పి మిమ్మల్ని నమ్మిస్తారు. నాకు కొరియర్ రావాల్సినవి వస్తువులేమీ లేవని వారికి మీరు చెప్పినప్పటికీ వాళ్లు మీ పేరు, ఫోన్ నంబరు చెప్పడంతో.. ఆ వివరాలు నావే అని చెప్పేస్తారు. ఆతర్వాత… ఆ కొరియర్లో డ్రగ్స్, ఎక్స్‌ప్లోజివ్స్ ఉన్నాయని చెప్పి నమ్మించి అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడుతున్నారని చెప్పి మీ యొక్క ఆధార్, పాన్, బ్యాంక్ డీటెయిల్స్ ను మీ ద్వారా తెలుసుకొని మీ మీద ముంబై సైబర్ పోలీసులకు ఫిర్యాదు చేస్తున్నామని చెప్పి భయభ్రాంతులకు గురిచేస్తారు. ఆతర్వాత ముంబై సైబర్ క్రైమ్ పోలీస్ విభాగం నుండి ఫోన్ చేస్తున్నామని నమ్మించి మిమ్మలను ఒక హోటల్ రూమ్‌లో కానీ ఇంటిలోనే ఒక గదిలో కానీ ఒంటరిగా ఉండమని చెప్పి స్కైప్ కాల్స్ లో మాట్లాడుతూ మీకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ మొత్తం తీసుకుంటారు.. తరువాత ఫైన్ కట్టాలని మోసగించి మొత్తం డబ్బులను వారి అకౌంటు వేయించుకుంటారు ఈ విధంగా కొత్త తరహా సైబర్ నేరాలకు పాల్పడుతున్నారు.
మీ మీద నిజంగా ఏదయినా పోలీస్ కేసు లో వుంటే సంబంధించిన పోలీస్ ఆఫీస్ నేరుగా వస్తారు అంతేగాని వాట్సాప్ లో కాల్ చేసి
స్కైప్ , వీడియో కాల్ అంటూ ఎవరు చేయరు. అలా చేసినట్లయితే వారు సైబర్ నేరగాళ్ళు అని మనం అర్థం చేసుకోవాలి
అంతేకాకుండా… సమీప పోలీసు స్టేషన్ కు సమాచారం చేరవేయాలి లేదా కనీసం మీ కుటుంబ సభ్యులతో విషయాన్ని పంచుకోవాలి. వాట్సాప్ లో మీ యొక్క/ మీ ఫ్యామిలీ ఫొటోస్ ను ప్రొఫైల్ ఫోటో గా పెట్టకపోవడం మంచిది.
మీ వ్యక్తిగత డీటెయిల్స్ ను అనవసరంగా అపరిచితులకు ఇవ్వడం అంత మంచిది కాదు.
వ్యక్తిగత వివరాలు, బ్యాంకింగ్ వివరాలు ఎవరితోనూ పంచుకోకుడదు.
మీకు తెలియని వ్యక్తి పరిచయం అయితే ఎట్టి పరిస్థితులలో వారు పెట్టే రిక్వెస్ట్ ని ఆక్సిప్టు చేయకూడదు.
మీ యొక్క వ్యక్తి గత వివరాలను సోషియల్ మీడియా నందు గోప్యంగా ఉంచాలి.
బహుమతులు గెలుచుకున్నారు అని వచ్చే ఇమెయిల్ అండ్ మెసేజెస్ ల గురించి స్పందిచవద్దు
మీరు మీ ఫ్యామిలీ తో గాని లేక మీరు గాని ఎక్కడికయినా వెళ్ళినప్పుడు మీ యొక్క పర్సనల్ డేటా అనవసరంగా పొందుపరచరాదు. సైబర్ నేరాల బారిన పడిన వెంటనే టోల్ ఫ్రీ నంబర్ 1930 కు లేదా .సైబరక్రైమ్ .గోవ్ .ఇన్ నందు ఫిర్యాదు చేయాలని జిల్లా ఎస్పీ గారు విజ్ఞప్తి చేశారు