రక్తదానం మరొకరికి ప్రాణదానం
ఎమ్మెల్యే -కందికుంట : విశాలాంధ్ర, కదిరి. జనసేన పార్టీ అధినేత రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ జన్మదిన పురస్కరించుకొని ఎన్ జీ ఓ హోంలో ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరాన్ని ఎమ్మెల్యే కందికుంట వెంకట ప్రసాద్ ప్రారంభించారు. జనసేన నాయకులతో కలిసి కేక్ కట్ చేసి పంచి పెట్టారు.సమాజానికి తమ వంతు సేవలు అందించడానికి ముందుకు వచ్చిన జనసేన నాయకులను అభినందించారు.రక్తదానం మరొకరికి ప్రాణ దానమని,రక్త దానం వెలకట్టలేనిదని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఎన్డీయే నాయకులు బైరవ ప్రసాద్, అనిల్ కుమార్ రెడ్డి, బ్లూ మూన్ శివ శంకర పాల్గొన్నారు.