Free Porn
xbporn

https://www.bangspankxxx.com
Friday, September 20, 2024
Friday, September 20, 2024

రక్త దాతలు ప్రాణదాతలు..

విశాలాంధ్ర – జేఎన్టీయూ ఏ : నిత్యజీవితంలో వివిధ ప్రమాదాలకు గురి అయినవారికి, అనారోగ్య కారణాల లో చికిత్స పొందుతున్న బాధితులకు భరోసాగా రక్త దాతలు ప్రాణదాతలుగా నిలుస్తారని జవహర్లాల్ నెహ్రూ సాంకేతిక విశ్వవిద్యాలయం ఇన్చార్జి వీసీ ఆచార్య సుదర్శన్ రావు పేర్కొన్నారు. మంగళవారం ఇంజనీరింగ్ కళాశాలలోని
జాతీయ సేవ పథకం , ప్రభుత్వ సర్వజన ఆసుపత్రి రక్తనిధి సంయుక్తంగా స్వచ్ఛంధ రక్తదాన శిబిరం నిర్వహించారు. ఈ సందర్బంగా ఉపకులపతి మాట్లాడుతూ.. స్వచ్ఛందంగా ముందుకు వచ్చి రక్తం ఇస్తే అత్యవసర పరిస్థితుల్లో ఉన్నవారికి ఉపయోగపడుతుంది అని పేర్కొన్నారు. అనంతరం కళాశాల ప్రిన్సిపాల్ ఆచార్య ఎస్.వి. సత్యనారాయణ మాట్లాడుతూ.. ప్రతీ ఒక్కరు రక్తదానం చేయడం అనేది సామాజిక బాధ్యతగా గుర్తించుకొని ప్రతి మూడు నెలలకోసారి రక్తదానం చేయాలని తెలిపారు. కళాశాల వైస్ ప్రిన్సిపాల్ ఆచార్య అరుణ క్రాంతి మాట్లాడుతూ.. 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరు స్వచ్చందంగా రక్తదానం చేయడానికి ముందుకు రావాలని పేర్కొన్నారు. ఈ సీ ఈ విభాగాదిపతి , జాతీయ సేవ పథకం కార్యక్రమ అధికారి డాక్టర్ జి. మమత .. రక్తదానం విద్యార్థులలో సేవాభావం పెంపొందుతుంది అని తెలిపారు. రక్త దానం కేవలం ప్రాణాలు కాపాడడమే కాకుండా మానవత విలువలు సైతం కాపాడుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో కళాశాల విద్యార్థులు, అధ్యాపకులు స్వచ్ఛందంగా రక్తదానం చేశారు. రక్తదానం చేసిన వారికి సర్వజన ఆసుపత్రి రక్తనిది సంస్థ అభినందన పత్రం అందజేశారు.
ఈ కార్యక్రమంలో ఆచార్య ఎ. ఆనంద రావు , డాక్టర్ ఎం. రామ శేఖర రెడ్డి , జోజిరెడ్డి , శ్యాం బాబు , డాక్టర్ నీరజ , వివిధ విభాగాదిపతులు, రక్తనిధి సిబ్బంది డా” బాలాజీ, శ్రీ రమణా రెడ్డి, మురళీ మోహన్ బృందం విద్యార్ధులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img