విశాలాంధ్ర పామిడి (అనంతపురం జిల్లా) : పామిడి పట్టణం అంబా భవాని కాలనీ నందు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి కొనిదెల పవన్ కళ్యాణ్ జన్మదిన సందర్భంగా మంగళవారం నిర్వహించారు. నాగిరెడ్డి కాలనీ మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల లో జనసేన బిజెపి టిడిపి నాయకులు విద్యార్థులుకు పుస్తకాలు పెన్నులు అన్నదానము చేశారు.ఈ సందర్భంగా జనసేన పార్టీ నాయకులు మునగల అనిల్ కుమార్, వడ్డే రాము మాట్లాడుతూ ప్రతి సంవత్సరము జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ పుట్టిన రోజు సందర్భంగా స్కూల్ కి ప్రతి సంవత్సరం అన్నదానం ఏర్పాటు చేస్తానని తెలిపారు.ఈ కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయులు కుళ్లాయప్ప, టీచర్ రామాంజనేయులు,రాణి,స్కూల్ చైర్మన్ ఐసు,సూర్యనారాయణ,షేక్షావలి, నాగేంద్ర,చంద్రశేఖర్ యాదవ్,లక్ష్మీదేవి, తదితరులు పాల్గొన్నారు.