Free Porn
xbporn

https://www.bangspankxxx.com
Sunday, September 15, 2024
Sunday, September 15, 2024

మట్టి వినాయకుడిని పూజించాలి : పర్యావరణాన్ని పరిరక్షించాలి

విశాలాంధ్ర – అనంతపురం : వినాయక చతుర్థి సందర్భంగా మట్టి వినాయకుడిని పూజించాలని పర్యావరణాన్ని పరిరక్షించాలని శ్రీ జి రామ కృష్ణా రెడ్డి, జాయింట్ కలెక్టర్ & అదనపు జిల్లా మేజిస్ట్రేట్ ( ఇంచార్జ్ ), అనంతపురము పేర్కొన్నారు. బుధవారం ఆంధ్రప్రదేశ్ కాలుష్య నియంత్రణ మండలి, ప్రాంతీయ కార్యయలయము, అనంతపురము ఆధ్వర్యంలో వినాయక చతుర్థి మరియు దుర్గ పూజ సందర్భంగా మట్టి విగ్రహాలను పూజించాలని, ఈ సందర్భంగా జాయింట్ కలెక్టర్ & అదనపు జిల్లా మేజిస్ట్రేట్ ( ఇంచార్జ్ ), అనంతపురము మాట్లాడుతూ వినాయక చవితి విశిష్టతను కాపాడేందుకు అందరూ సమిష్టిగా కృషి చేయాలన్నారు. సహజ రంగులతో చేసిన మట్టి ప్రతిమలతో పర్యావరణ అనుకూల వినాయక చవితిని జరుపుకోవాలన్నారు. వినాయక చవితి పండుగను సుస్థిరంగా మరియు పర్యావరణానికి అనుకూలంగా జరుపుకోవాలని, చెరువులు మరియు జల వనరులకు నష్టం కలిగించే వ్యర్థ పదార్థాల వినియోగం తగ్గిద్దాం లేదా పూర్తిగా మానేయాలన్నారు. మట్టితో చేసిన ప్రతిమలను వాడాలని, విగ్రహాల తయారీకి సహజసిద్ధమైన రంగులను ప్రకృతిలో లభ్యమయ్యే పత్తి, నారా వంటి పదార్థాలను వినియోగించాలన్నారు. ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ (పి ఓ పి ) విగ్రహాల వాడకం నిషేధించబడిందని మరియు పిఓపిలో హానికరమైన రసాయనాలు నీటి కాలుష్యానికి దారితీస్తాయని మరియు నీటి వనరుల కాలుష్యాన్ని నివారించడానికి పర్యావరణ అనుకూలమైన (క్లే) గణేష్ విగ్రహాలను మాత్రమే ఉపయోగించాలన్నారు.
హైకోర్టు, మహారాష్ట్ర ఆదేశాలకు అనుగుణంగా విగ్రహాల తయారీ, నిమజ్జన కార్యక్రమం జరగాలని సూచించారు. వినాయక మండపాలకు అనుమతులు జారీ చేసేటప్పుడు మరియు విగ్రహాల ఏర్పాటు సమయంలో కూడా రెవెన్యూ డిపార్ట్మెంట్, మున్సిపల్ కార్పొరేషన్, జిల్లా పంచాయతీ డిపార్ట్మెంట్, అగ్నిమాపక శాఖ, విద్యుత్ శాఖ మరియు పోలీసు డిపార్ట్మెంట్లు కేంద్ర కాలుష్య నియంత్రణ మండలి జారీ చేసిన సవరించిన మార్గదర్శకాలను అనుసరించాలన్నారు.
ఈ కార్యక్రమంలో గుంతకల్లు, అనంతపురం కళ్యాణదుర్గం రెవెన్యూ డివిజనల్ అధికారులు, అనంతపురం జిల్లా మునిసిపల్ కమీషనర్లు, ఏపిపిసిబి ఎన్విరాన్మెంటల్ ఇంజనీర్ శ్రీ పివి. కిషోర్ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img