విశాలాంధ్ర-తాడిపత్రి : పట్టణంలోని 30వ వార్డ్, భగత్ సింగ్ నగర్లో గత కొన్ని రోజుల నుంచి కురుస్తున్న వర్షాలకు వార్డులో నీరు నిల్వ చేరి దోమలు ఎక్కువ అవుతున్నాయని కాలనీ ప్రజలు కౌన్సిలర్ మల్లికార్జునకు సమస్యను తెలియజేశారు. దీంతో కౌన్సిలర్ మల్లికార్జున పారిశుద్ధ్య అధికారికి ఫిర్యాదు చేసి కాలనీలో కౌన్సిలర్ మల్లికార్జున చొరవ తీసుకొని పారిశుద్ధ కార్మికుల చేత నీటి నిల్వ ఉన్నచోట దోమల మందు పిచికారి చేసి, బ్లీచింగ్ పౌడర్ తదితర దోమల నివారణ చర్యలు చేపట్టారు. అలాగే అండర్ డ్రైనేజ్ మురుగునీరు ముందుకు సాగక బ్లాక్ ఆయనచోట గుర్తించి మురుగునీరు ముందుకు వెళ్లే విధంగా చర్యలు చేపట్టారు. అంతే కాకుండా కాలనీలోని చెత్తా, చెదార మంతా శుభ్రం చేయించారు. దీంతో కాలనీలోని సమస్యలు పరిష్కరించి నందుకు కౌన్సిలర్ మల్లికార్జునకు ప్రజలు హర్షం వ్యక్తం చేశారు.