విశాలాంధ్ర- కదిరి : కదిరి మండల బీసీ బాలుర హాస్టల్ వార్డెన్ జయరామి రెడ్డికి పలువురు అభినందనలు తెలియజేశారు. ఆగస్టు 15 ఉత్తమ వార్డెన్ గా మంత్రి సబితమ్మ చేతుల మీదుగా అవార్డు అందుకున్న సందర్భంగా కార్యాలయ సిబ్బంది, విద్యార్థులు కలిసి పూల మాలలు, శాలువ కప్పి సన్మానించారు. ఉత్తమ వార్డెన్ గా ప్రభుత్వం నన్ను గుర్తించి అవార్డు అందించడంతో తన బాధ్యత మరింత పెరిగిందని వచ్చే పదవ తరగతి పరీక్ష ఫలితాల్లో వంద శాతం ఉత్తీర్ణత సాధించడానికి నేటి నుండి ప్రత్యేక శ్రద్ధ వహిస్తున్నట్లు తెలిపారు.