విశాలాంధ్ర- ఉరవకొండ (అనంతపురం జిల్లా) : నూతనంగా జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులుగా ఎన్నికైన రాకెట్ల వై మధుసూదన రెడ్డిని శుక్రవారం ఉరవకొండ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఘనంగా సన్మానించి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ జిల్లా కార్యదర్శి సోనియా శీనా, పార్టీ మైనార్టీ విభాగం నాయకులు అబ్బాస్ మాట్లాడుతూ నూతన అధ్యక్షులు మధుసూదన రెడ్డి జిల్లాలో కాంగ్రెస్ పార్టీకి పూర్వ వైభవం తీసుకురానున్నట్లు వారు తెలిపారు