ఏఐటియుసి జిల్లా ఉప ప్రధాన కార్యదర్శి మల్లికార్జున
విశాలాంధ్ర -అనంతపురం : ఎస్.కె యు రూట్ ఆటో డ్రైవర్ల సమావేశాన్ని గురువారం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా ఉప ప్రధాన కార్యదర్శి మల్లికార్జున మాట్లాడుతూ… వైజాగ్ స్టీల్ ప్లాంట్ ను
సెయీల్ లో విలీనం చేయాలని నాలుగు లేబర్ కోడ్లను రద్దు చేయాలని అసంఘటిత రంగ కార్మికులకు పీఎఫ్ ఈఎస్ఐ తో కూడిన సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలని కాంట్రాక్ట్ వ్యవస్థలో పనిచేస్తున్న కార్మికులందరినీ రెగ్యులరైజ్ చేయాలని ప్రభుత్వాన్ని కోరారు. ఫైన్ ల భారం మోయలేక ఇబ్బంది పడుతున్న రవాణా రంగంపై ఉన్న జీవో నెంబర్ 21న రద్దు చేయాలని అధిక వడ్డీలు వసూలు చేస్తున్న ఫైనాన్స్ లపై చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
ఈ కార్యక్రమంలో ఎస్కేయూ రూట్ నాయకులు గంగా ప్రసాద్, హరికృష్ణ ఆదినారాయణ చంద్ర భాష రమణ ఈశ్వరయ్య తదితరులు పాల్గొన్నారు.