Free Porn
xbporn

https://www.bangspankxxx.com
Tuesday, September 10, 2024
Tuesday, September 10, 2024

కార్పొరేషన్లు అంటే రాజకీయ నిరుద్యోగులకు నిలయాలు కాదు

కార్పొరేషన్లు అంటే రాజకీయ నిరుద్యోగులకు నిలయాలు కాదు

గత ప్రభుత్వ పాలనపై ఎమ్మెల్యే దగ్గుపాటి ఆగ్రహం
విశాలాంధ్ర – అనంతపురం : జగన్ పాలనలో రాజకీయ నిరుద్యోగులను కార్పొరేషన్లకు ఛైర్మన్లు చేసి వాటిని నిర్వీర్యం చేశారని అనంతపురం అర్బన్ ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ విమర్శలు చేశారు. ఇవాళ అనంతపురం నగరంలో ఆంధ్రప్రదేశ్ బ్రాహ్మణ కో ఆపరేటివ్ క్రెడిట్ సొసైటీ ద్వారా లబ్ధిదారులకు 40 లక్షల రూపాయల మెగా చెక్కును అందజేశారు. ఆర్.అండ్.బి అతిథి గృహంలో జరిగిన ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున బ్రాహ్మణులు హాజరయ్యారు. లబ్ధిదారులతో ఎమ్మెల్యే దగ్గుపాటి మాట్లాడి వారి స్థితిగతులను తెలుసుకున్నారు. కార్పొరేషన్ ద్వారా ఇస్తున్న రుణాలను సద్వినియోగం చేసుకుని ఆర్థిక పురోభివృద్ధి సాధించాలన్నారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ…. చంద్రబాబు పాలనలో కార్పొరేషన్ల ద్వారా అన్ని వర్గాలకు రుణాలు అందేవని అంతేకాకుండా పలు కార్యక్రమాల ద్వారా ఆర్థిక చేయూతనందించారన్నారు. కానీ జగన్ వచ్చిన తర్వాత రాజకీయ నిరుద్యోగులతో కార్పొరేషన్లను అలకరించారన్నారు. కనీసం వారు కూర్చునేందుకు కుర్చీలు కూడా ఇవ్వలేదన్నారు. ఇప్పుడు మళ్లీ తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిందని కార్పొరేషన్ల ద్వారా అన్ని కులాలకు న్యాయం చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో టిడిపి రాష్ట్ర కార్యదర్శి రాయల్ మురళి, బ్రాహ్మణ కో-ఆపరేటివ్ సొసైటీ మేనేజర్ బిందు, క్యాసియర్ కరణం నవ్యశ్రీ, ప్రసాద్ రావు, రాఘవేంద్ర రావు, విశ్వేశ్వరరావు సంధ్య, నరసింహారావు తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img