నిరాశ్రయులైన ప్రజలను ఆదుకుందాం….
కేంద్రం జాతి విపత్తుగా పరిగణించాలి….
సిపిఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు జగదీష్
విశాలాంధ్ర -అనంతపురం : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉభయ గోదావరి జిల్లాలో సంభవించినటువంటి పెను తుఫాల్లో లక్షలాదిమంది నిరాశ్రయులు కావడంతో వారిని ఆదుకోవడానికి సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ పిలుపుమేరకు సిపిఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు జగదీష్ జిల్లాలో శుక్రవారం పెద్ద ఎత్తున విరాళ సేకరణ కార్యక్రమంలో పాల్గొన్నారు. స్థానిక పాతూరు లోని గాంధీ విగ్రహం వద్ద నుంచి వివిధ ప్రాంతాలలో సిపిఐ నగర సమితి, నగర కార్యదర్శి శ్రీరాముల ఆధ్వర్యంలో విరాళాల సేకరణ కార్యక్రమం చేపట్టారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా సిపిఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు జగదీష్, జిల్లా కార్యదర్శి జాఫర్, జిల్లా సహాయ కార్యదర్శి నారాయణస్వామి పాల్గొన్నారు. ఈ సందర్భంగా రాష్ట్ర కార్యవర్గ సభ్యులు జగదీష్ మాట్లాడుతూ… రాష్ట్రంలో ఉభయగోదావరి కృష్ణాజిల్లాలో వరద బాధితులకు రాజకీయాలకు అతీతంగా విరాళాలను సేకరించడం జరిగిందన్నారు. విరాళాల ద్వారా స్వీకరించిన నగదు, వంట పాత్రలు, బట్టల ను విజయవాడలోని సి పి ఐ రాష్ట్ర కార్యాలయానికి తరలించడం జరుగుతుందన్నారు. పెద్ద మొత్తం ఇవ్వాల్సిన వారు రాష్ట్ర ముఖ్యమంత్రి సహాయ నిధికి గాని సిపిఐ పార్టీకి చెక్కుల రూపంలో ఇవ్వవచ్చు అన్నారు. కేంద్ర ప్రభుత్వం విపత్తులను ఎదుర్కోవడానికి పదివేల కోట్లు విడుదల చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. నరేంద్ర మోడీ స్వయంగా పర్యటించి జాతీయ విపత్తుగా ప్రకటించాలని సిపిఐ పార్టీ డిమాండ్ చేస్తుందన్నారు. సిపిఐ జిల్లా కార్యదర్శి జాఫర్ మాట్లాడుతూ… సిపిఐ రాష్ట్ర కమిటీ పిలుపుమేరకు జిల్లాలో గ్రామీణ స్థాయి నుంచి పట్టణ స్థాయి వరకు పెద్ద ఎత్తున విరాళాల సేకరణ చేపట్టడం జరుగుతుందన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు విపత్తు సంభవించినప్పుడు ముందస్తుగా వాలంటీర్లను సహాయ కార్యక్రమాలకు దించి ఉంటే ఇంత ముప్పు జరిగి ఉండేది కాదన్నారు. అనంత ప్రజలు స్వచ్ఛందంగా విరాళాలను ఇవ్వడం అభినందనీయమన్నారు. జిల్లా సహాయ కార్యదర్శి నారాయణస్వామి మాట్లాడుతూ… జిల్లాలో చిరు, పెద్ద వ్యాపారస్తులు, రైతులు, కార్మికులు స్వచ్ఛందంగా విరాళాలు ఇవ్వడం పట్ల పేరుపేరునా ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో సిపిఐ నగర సహాయ కార్యదర్శులు రమణ, అల్లిపిరా, జిల్లా కార్యవర్గ సభ్యులు లింగమయ్య, ఏఐవైఎఫ్జిల్లా ప్రధాన కార్యదర్శి సంతోష్, ఏఐఎస్ఎఫ్ జిల్లా అధ్యక్ష ప్రధాన కార్యదర్శి రమణయ్య, కుళాయి స్వామి నగర అధ్యక్షులు మంజునాథ్ నగర నాయకులు సమీర్,నాని,తరుణ్,వరుణ్, అభిషేక్, కార్తీక్, సిపిఐ జిల్లా సమితి సభ్యులు నగర కార్యవర్గ సభ్యులు సమితి సభ్యులు ప్రజాసంఘాల నాయకులు తదితరులు పాల్గొన్నారు