విశాలాంధ్ర- అనంతపురం : సిపిఐ ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర సమితి, రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ పిలుపు మేరకు రాష్ట్రంలో ఉభయగోదావరి కృష్ణాజిల్లాలో వరద బాధితులకు విరాళాల సేకరణ కార్యక్రమంలో భాగంగా అనంతపురం నగరంలో సిపిఐ నగర సమితి, నగర కార్యదర్శి శ్రీరాములు ఆధ్వర్యంలో విరాళాల సేకరణ కార్యక్రమం చేపట్టడం జరిగింది. అందులో భాగంగా ప్రజల దగ్గర విరాళాలు ద్వార సేకరించిన డబ్బులు 40,965 సీపీఐ జిల్లా కార్యదర్శి జాఫర్ కి బుధవారం స్థానిక సిపిఐ పార్టీ కార్యాలయంలో సిపిఐ నగర కార్యదర్శి శ్రీరాములు, సహాయ కార్యదర్శులు రమణ, అల్లిపిరా ఏఐవైఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి సంతోష్ కుమార్, అందజేయడం జరిగింది. ఈ సందర్భంగా జాఫర్ మాట్లాడుతూ… ప్రజల వద్ద నుంచి సేకరించిన విరాళాలను రాష్ట్ర సిపిఐ కార్యాలయానికి పంపించడం జరుగుతుందన్నారు. వరద బాధితుల సహాయార్థం కోసం విరాళాలు అందించిన చిన్న పెద్ద వ్యాపారస్తులకు సేకరణలో స్పందించిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలియజేశారు.