విశాలాంధ్ర- అనంతపురం : ఉపకులపతి ఆచార్య ఎస్. ఎ. కోరి నేతృత్వంలో కొత్తగా ప్రారంభించబడిన ఆంధ్ర ప్రదేశ్ కేంద్రీయ విశ్వవిద్యాలయం (సి యూ ఏ పి ) క్యాంపస్ బలమైన మాదక ద్రవ్య వ్యతిరేక సందేశాన్ని ప్రతిధ్వనించింది. ఎన్ ఎస్ ఎస్ ఆధ్వర్యంలో 2024 ఆగస్టు 12న నషా ముక్త్ అభియాన్ పథకం కింద వర్శిటీ విద్యార్థినీ విద్యార్థులు, అధ్యాపకులు అంతా సామూహిక ప్రతిజ్ఞను చేశారు.
డీన్ ఆచార్య షీలారెడ్డి మాట్లాడుతూ డ్రగ్స్ రహిత క్యాంపస్ వాతావరణం నెలకొల్పాలని, విద్యార్థులలో బలమైన విలువలను పెంపొందించుకోవాలని నొక్కి చెప్పారు. డ్రగ్స్ దుర్వినియోగం వల్ల విద్యార్థుల భవిష్యత్తుపై పడే వినాశకరమైన ప్రభావాన్ని గురించి ఆచార్య జి రామ్ రెడ్డి వివరించగా, డాక్టర్ చెల్లి కావ్య డ్రగ్స్ రకాలు, వాటి దుర్వినియోగం, మనస్సు మరియు శరీరంపై వాటి హానికరమైన ప్రభావాలను విశదీకరించారు.
విద్యార్థులలో మాదకద్రవ్యాల దుర్వినియోగంపై అవగాహన పెంచడం కోసం ఎన్ ఎస్ ఎస్ వాలంటీర్లు చక్కటి ప్రసంగాలను చేశారు. ఈ కార్యక్రమంలో సుమారు 250 మందికి పైగా పాల్గొన్నారు. మాదకద్రవ్యాలకు వ్యతిరేకంగా ఐక్య వైఖరిని ప్రదర్శిస్తూ అంతా ప్రతిజ్ఞ చేశారు. ఎన్‌ఎస్‌ఎస్ ప్రోగ్రామ్ కోఆర్డినేటర్ డాక్టర్. గరికిపాటి. గురజాడ మరియు రెండు యూనిట్ల అధికారులు డాక్టర్. శ్రేయ మరియు డాక్టర్ దీపాంకర్ కార్యక్రమాన్ని నిర్వహించారు.