జేఎన్టీయూ వీసీ ఆచార్య సుదర్శన్ రావు
విశాలాంధ్ర – జేఎన్టీయూ ఏ: బోధించే బోధన పాఠ్యాంశాలు విద్యార్థుల హృదయాలలో నిలవాలని జోహార్ లాల్ నెహ్రూ సాంకేతిక విశ్వవిద్యాలయ ఇన్చార్జి వీసీ ఆచార్య సుదర్శన్ రావు పేర్కొన్నారు. బుధవారం ఇంజినీరింగ్ కళాశాల , ఎస్ ఇ ఆర్ బి సంయుక్తంగా మెకానికల్ ఇంజినీరింగ్ విభాగంలో మూడు రోజులు ఫ్యాకల్టీ డెవలప్మెంట్ సదస్సు ను వీసీ, ప్రిన్సిపల్ ఆచార్య పి. చెన్నా రెడ్డి జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. అనంతరం వీసీ మాట్లాడుతూ… సాంకేతిక విజ్ఞానాన్ని మరింత అందిపుచ్చుకొని.. విద్యార్థులకు సులువైన విధానంలో బోధనను అందిస్తూ.. సృజనాత్మక, పరిశోధత్ముక నైపుణ్యాలను మెరుగుపరచాలని అధ్యాపకులకు సూచించారు. ఈ కార్యక్రమంలో మెకానికల్ విభాగాధిపతి డా కె. కళ్యాణి రాధా , ప్రోగ్రాం కోఆర్డినేటర్ డా బి. ఓం ప్రకాశ్ , వైస్ ప్రిన్సిపాల్ ఆచార్య ఎస్. వసుంధర , ఆచార్య కె. హేమ చంద్రా రెడ్డి , డైరెక్టర్ ఆచార్య జి. ప్రశాంతి ,ఆచార్య బి. దుర్గా ప్రసాద్ ఆచార్య నాగ ప్రసాద్ నాయుడు , ఆచార్య బి. చంద్ర మోహన్ రెడ్డి , ఆచార్య ఎ.పి. శివ కుమార్ , డా .ఎం. రామ శేఖర రెడ్డి , అజిత డి.ఆర్. శ్రీనివాసన్ , అధ్యాపకులు , విద్యార్థులు పాల్గొన్నారు.