విశాలాంధ్ర – అనంతపురం : అనంతపురం జిల్లా అదనపు ఎస్పీగా డి.వి.రమణమూర్తి బుధవారం తన ఛేంబర్లో బాధ్యతలు స్వీకరించారు. కడప జిల్లాకు చెందిన డి.వి.రమణమూర్తి 1989 లో ఎస్సైగా పోలీసుశాఖలో చేరారు. ఆ తర్వాత సి.ఐ… డీఎస్పీగా పదోన్నతి పోందారు.అప్పా, కర్నూలు స్పెషల్ బ్రాంచి డీఎస్పీగా పని చేశారు. అదనపు ఎస్పీగా పదోన్నతి పొంది అనంతపురం పి.టి.సి … అక్కడి నుండీ సాధారణ బదిలీలలో భాగంగా జిల్లా పోలీసుశాఖ అడ్మిన్ గా బదిలీ అయ్యి ఈరోజు బాధ్యతలు చేపట్టారు. అనంతపురం రేంజ్ డి.ఐ.జి, జిల్లా ఎస్పీల ఆదేశాల మేరకు జిల్లా పోలీసు సిబ్బందిని సమన్వయం చేసుకుని ముందుకెళ్తానని ఆయన తెలియజేశారు. నూతన అదనపు ఎస్పీని మర్యాద పూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలియజేసిన పలువురు పోలీసు అధికారులు
నూతన అదనపు ఎస్పీగా బాధ్యతలు చేపట్టిన డి.వి.రమణమూర్తిని పలువురు పోలీసు అధికారులు మర్యాదపూర్వకంగా కలిశారు. బదిలీపై వెళ్తున్న అదనపు ఎస్పీలు ఆర్ విజయ భాస్కర్ రెడ్డి, జి.రామకష్ణలు కలిసి శుభాకాంక్షలు తెలియజేశారు. సి.ఐ లు ధరణీకిశోర్, ఇస్మాయిల్, ప్రతాప్ రెడ్డి, ఆర్ ఐ లు కె.రాముడు, మధు మరియు జిల్లా పోలీసుకార్యాలయం ఏ.ఒ శంకర్, లీగల్ అడ్వైజర్ విష్ణువర్ధన్ రెడ్డి, డిపిఓ సూపరింటెండెంట్లు ప్రసాద్, సావిత్రమ్మ మరియు సిబ్బంది, తదితరులు మర్యాద పూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలియజేశారు.