సెప్టెంబర్ 5 నుంచి 22వ దులీప్ ట్రోఫీ క్రికెట్ టోర్నమెంట్
– ఏసీఏ త్రీమెన్ కమిటీ మెంబర్ మాంచో ఫెర్రర్
విశాలాంధ్ర – జేఎన్టీయూ ఏ: దేశీయ క్రికెట్‌లో అత్యంత ప్రతిష్టాత్మకమైన దులీప్ ట్రోఫీ క్రికెట్ టోర్నమెంట్ సెప్టెంబర్ 5 నుంచి 22వ వరకు నిర్వహించేందుకు అవసరమైన ఏర్పాట్లు చేస్తున్నట్లు ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ (ఏసీఏ) త్రీమెన్ కమిటీ మెంబర్, ఆర్డీటీ ప్రోగ్రాం డైరెక్టర్ మాంచో ఫెర్రర్ పేర్కొన్నారు. దులీప్ ట్రోఫీ ఆర్గనైజింగ్ కమిటీ కార్యదర్శి కె.ఎస్.షాబుద్దీన్, ఏడీసీఏ కార్యదర్శి కె.మధు ఆచారి, కమిటీ సభ్యులు పగడాల మల్లిఖార్జున, జొన్న జయప్రకాశ్‌లతో కలిసి గురువారం అనంతపురం స్పోర్ట్స్ విలేజ్‌లో మాంచో ఫెర్రర్ మీడియాతో మాట్లాడారు. అనంతపురంలో మొత్తం 5 మ్యాచ్‌లు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. పోలీస్ భద్రత చర్యలను పర్యవేక్షణలో కొనసాగుతుందన్నారు. మ్యాచ్‌ను తిలకించేందుకు ప్రతి రోజు 4 వేల పాసులు జారీ చేస్తాం. పాస్‌ల జారీకి ఆర్డీటీ స్పోర్ట్స్ సెంటర్‌లో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన కౌంటర్ల ద్వారా ఒక్కొక్కరికి ఒక్క పాస్ మాత్రమే ఇస్తాము. మ్యాచ్ రోజు ఉదయం 8.30 గంటల నుంచి 10.30 గంటల వరకు మాత్రమే పాస్‌లు ఉన్నవారిని అనుమతిస్తాము.
స్టార్ స్పోర్ట్స్‌లో ప్రత్యక్ష ప్రసారం..
అనంతపురం క్రికెట్ చరిత్రలో తొలిసారిగా దులీప్ ట్రోఫీ క్రికెట్ టోర్నమెంట్‌ను స్టార్ స్పోర్ట్స్‌లో ప్రత్యక్ష ప్రసారం ఉంటుంది. క్రికెట్ చూసేందుకు వచ్చే అభిమానుల వాహనాల కోసం ప్రత్యేకంగా పార్కింగ్‌ను ఏర్పాటు చేస్తున్నాము. క్యాంపస్‌లో స్నాక్స్ కౌంటర్‌ను కూడా అందుబాటులో ఉంచుతాము.
మ్యాచ్ షెడ్యూల్ ఇలా..
– సెప్టెంబర్ 5 నుండి 8వ తేదీ వరకు – టీమ్ సి – టీమ్ డి (ఆర్డీటీ స్టేడియం ‘ఏ‘)
– సెప్టెంబర్ 12 నుండి 15 వరకు – టీమ్ ఏ – టీమ్ డి (ఆర్డీటీ స్టేడియం ‘ఏ‘)
– సెప్టెంబర్ 12 నుండి 15 వరకు – టీమ్ బి – టీమ్ సి (ఆర్డీటీ స్టేడియం ‘బి‘ గ్రౌండ్)
– సెప్టెంబర్ 19 నుండి 22 వరకు – టీమ్ ఏ – టీమ్ సి ( ఆర్డీటీ స్టేడియం ‘ఏ‘)
– సెప్టెంబర్ 19 నుండి 22 వరకు – టీమ్ బి – టీమ్ డి (ఆర్డీటీ స్టేడియం ‘బి‘ గ్రౌండ్)
దులీప్ ట్రోఫీ కోసం జట్ల జాబితా..
టీమ్– ఏ :
శుభ్‌మన్ గిల్, మయాంక్ అగర్వాల్, రియాన్ పరాగ్, ధ్రువ్ జురెల్, కేఎల్ రాహుల్, తిలక్ వర్మ, శివమ్ దూబే, తనుష్ కొటì యన్, కుల్దీప్ యాదవ్, ఆకాశ్ దీప్, ప్రసిద్ధ్ కృష్ణ, ఖలీల్ అహ్మద్, అవేష్ ఖాన్, విద్వాత్ కావరప్ప, కుమార్ కుశాగ్రా, శాశ్వత్ రావత్.
టీమ్– బిః అభిమన్యు ఈశ్వరన్, యశస్వి జైస్వాల్, సర్పరాజ్ ఖాన్, రిషబ్ పంత్, ముషీర్‌ఖాన్, నితీష్ కుమార్‌రెడ్డి, వాషింగ్టన్ సుందర్, నవదీప్ సైనీ, యశ్ దయాల్, ముఖేష్ కుమార్, రాహుల్ చాహర్, సాయి కిషోర్, మెహిత్ అవస్తీ, జగదీశన్.
టీమ్– సిః రుతురాజ్ గైక్వాడ్, సాయి సుదర్శన్, రజత్ పాటిదార్, అభిషేక్ పోరెల్, సుర్యకుమార్ యాదవ్, ఇంద్రజిత్, హృతిక్ షోకీన్, మానవ్ సుతార్, గౌరవ్ యాదవ్, వైషాక్ విజయ్ కుమార్, అన్షుల్ ఖాంబోజ్, హిమాన్షు చౌహాన్, మయాంక్ మార్కండే, సందీప్ వారియర్.
టీమ్–డిః శ్రేయాస్ లైయర్, అథర్వ తైడే, యశ్‌దూబే, దేవదత్ పడిక్కల్, ఇషాక్ కిషన్, రికీ భుయ్, సరాంశ్ జైన్, అక్షర్ పటేల్, అర్ష్‌దీప్ సింగ్, ఆదిత్య థాకరే, హర్షిత్ రాణా, తుషార్ దేశ్ పాండే, ఆకాష్ సేన్‌గుప్తా, సౌరభ్‌కుమార్ ఉన్నారు.