విశాలాంధ్ర -అనంతపురం : స్థానిక శ్రీ సత్య సాయి ఇన్స్టిట్యూట్ ఆఫ్ హైయర్ లర్నింగ్ క్యాంపస్ లో శుక్రవారం దాదాపు 5 దశాబ్దాల క్రితం శ్రీ సత్య సాయి బాబా నాటిన రావి మహావృక్షాన్ని అక్కడే క్యాంపస్ లో మరో చోటికి తరలించి జీవం పోసినట్లు గ్రీన్ ఆర్మీ సభ్యులు గ్రీన్ ఆర్మీ వ్యవస్థాపకులు అనిల్ కుమార్ పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ శ్రీ సత్య సాయి ట్రస్ట్ వారు ఈ మహావృక్షాన్ని బ్రతికించాలన్న ఓ సంకల్పంతో గ్రీన్ ఆర్మీని సంప్రదించడం అందుకు డాక్టర్ గీతా బాల డైరెక్టర్, సత్యసాయి ఇన్స్టిట్యూట్ వారు విద్యార్థులు కలిసి ఈ మహా వృక్షాన్ని మరోచోట నాటే విధంగా నిర్ణయించి సుమారు ఐదు గంటలు జెసిబిలు క్రేన్లతో ఈ మహా వృక్షాన్ని తరలించడం జరిగింది. ఈ సందర్భంగా
గ్రీన్ ఆర్మీ సభ్యులు శ్రీ సత్య సాయి ట్రస్ట్ రత్నాకర్ కి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు. ఇలా ప్రతి ఒక్కరు మహావృక్షాలను బ్రతికించాలన్న సంకల్పం తో ముందుకు వెళితే హరిత అనంతపురం అవుతుందన్నారు.ఈ కార్యక్రమంలో గ్రీన్ ఆర్మీ సభ్యులు, సత్య సాయి ఇనిస్ట్యూట్ ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు