విశాలాంధ్ర ధర్మవరం:: స్వాతంత్ర దినోత్సవ కార్యక్రమాన్ని పురస్కరించుకొని పట్టణములోని మానవతా స్వచ్ఛంద సేవా సంస్థ అధ్యక్షులు తెల్లం నారాయణమూర్తి కార్యదర్శి చెన్నప్ప ల ఆధ్వర్యంలో పట్టణంలోని ఎస్సీ బాలికల హాస్టల్ లోని బాలికలకు విద్యాసామాగ్రిని పంపిణీ చేశారు. అనంతరం బిస్కెట్లు కూడా పంపిణీ చేశారు. తదుపరి నారాయణమూర్తి, చెన్నప్ప మాట్లాడుతూ విద్యార్థి దశ నుంచే దేశభక్తిని పెంపొందించుకోవాలని తెలిపారు. అదేవిధంగా చదువుతోపాటు క్రీడల పట్ల కూడా ప్రత్యేక శ్రద్ధను ఘనపరచాలని తెలిపారు. క్రమశిక్షణతో అకుంఠిత దీక్షతో శ్రద్ధతో చదువు పట్ల ఉండాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో సంయుక్త కార్యదర్శి మంజునాథ్, సభ్యులు వేణుగోపాల్, వెంకటేష్, రవి తదితరులు పాల్గొన్నారు.