విశాలాంధ్ర అనంతపురం : ఆంద్రప్రదేశ్ రాష్ట్ర ఎయిడ్స్ నియంత్రణ సంస్థ ఆదేశముల మేరకు జిల్లా వైద్య ఆరోగ్య శాఖ,జిల్లా ఎయిడ్స్ నివారణ మరియు నియంత్రణ అనంతపురం నందు మీకు తెలుసా….? రిడ్స్ స్వచ్చంద సంస్థ వారి ఆధ్వర్యంలో ఐ ఈ సి కాంపెయిన్ ను హెచ్.ఐ.వి/ఎయిడ్స్ పై అవగాహన కార్యక్రమం నిర్వహించడం జరిగింది . ఈ కార్యక్రమములో భాగముగా హెచ్.ఐ.వి, ఎయిడ్స్ వ్యాధి ఎలా వస్తుంది, ఎలా వ్యాపించదు, హెచ్.ఐ.వి, ఎయిడ్స్ రాకుండా ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి అని వివరంగా తెలిపారు. హెచ్.ఐ.వి, ఎయిడ్స్ వ్యాధిగ్రస్తుల పట్ల వివక్షత చిన్న చూపు లేకుండా ఎలాగా సమాజములో కలసి జీవించాలి, హెచ్.ఐ.వి,ఎయిడ్స్, క్షయ వ్యాధి సంబందం గూర్చి, సుఖ వ్యాధులు మరియు చికిత్స గూర్చి,కండోమ్ యొక్క ఉపయోగము గూర్చి, హెచ్.ఐ.వి,/ఎయిడ్స్ ఏక్ట్ 2017,ఏ ఆర్ టి మందులు, ఏ పి ఎస్ ఏ సి ఎస్ అప్ ,టోల్ ఫ్రీ నెంబర్ 1097 గూర్చి తెలుపుతూ అవగాహన కల్పిస్తూ హెచ్ ఐ వి పరిక్షలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సిపిఎం వి .
భాస్కర్, దిశా , రిడ్స్ ప్రాజెక్టు మేనేజర్ నరేష్ ,ఐటిఐ కళాశాల ప్రిన్సిపాల్ మరియు వారి సిబ్బంది శకుంతల,షేక్షావలి,అలివేలు ,శంషాద్ ,విజయకుమారి మరియు సిబ్బంది పాల్గొన్నారు.