జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్.వి
విశాలాంధ్ర -అనంతపురం : విజయవాడ వరద బాధితులను ఆదుకునేందుకు విరాళం అందించడం అభినందనీయమని జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్.వి, ఐ.ఏ.ఎస్ పేర్కొన్నారు. పెద్దపప్పూరులోని శ్రీ సాయిరాం ఇంగ్లీష్ మీడియం పాఠశాల విద్యార్థుల ద్వారా విజయవాడ వరద బాధితులకోసం విరాళాలు వసూలు చేయగా, వసూలు చేసిన 30,159 రూపాయలను శుక్రవారం అనంతపురం కలెక్టరేట్ లోని జిల్లా కలెక్టర్ ఛాంబర్ లో కరస్పాండెంట్ మదన్ మోహన్ రెడ్డి చేతులమీదుగా ఆ మొత్తాన్ని జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్.వి, కు అందజేశారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ విజయవాడ వరద బాధితులను ఆదుకునేందుకు విరాళం అందించడం ఎంతో గొప్ప విషయమన్నారు. పాఠశాలలోని విద్యార్థుల ద్వారా వసూలు చేయబడిన ఈ మొత్తాన్ని విద్యార్థులే స్వయంగా చేశారని శ్రీ సాయిరాం ఇంగ్లీష్ మీడియం పాఠశాల కరస్పాండెంట్ తెలిపారు. ఈ కార్యక్రమంలో శ్రీ సాయిరాం ఇంగ్లీష్ మీడియం పాఠశాల హెచ్.ఎం మల్లీశ్వరి, ఇన్చార్జిలు రామాంజినేయులు, గిరి, ఉపాధ్యాయులు భాస్కర్, అనంతయ్య, బాలాజీ, అంపయ్య, రమేష్, పీరా, బాషా, విద్యార్థులు, తదితరులు పాల్గొన్నారు.