London Escorts sunderland escorts 1v1.lol unblocked yohoho 76 https://www.symbaloo.com/mix/yohoho?lang=EN yohoho https://www.symbaloo.com/mix/agariounblockedpvp https://yohoho-io.app/ https://www.symbaloo.com/mix/agariounblockedschool1?lang=EN
Saturday, October 5, 2024
Saturday, October 5, 2024

డాక్టర్ మంచి శ్రీధర్ రావు సేవలు మరువలేనివి

కోవిడ్ సమయం లో వైద్యుడి గా ఉత్తమ సేవలందించారు

సూపరింటెండెంట్ డాక్టర్ కె ఎస్ ఎస్ వెంకటేశ్వరరావు

విశాలాంధ్ర- అనంతపురం : ప్రభుత్వ మెడికల్ కళాశాల, సర్వజన ఆసుపత్రిలో, చెవి ముక్కు గొంతు విభాగం ప్రధాన విభాగాధిపతి ఆచార్య డాక్టర్ మంచి శ్రీధర్ రావు పదవి విరమణ సత్కార కార్యక్రమాన్ని ప్రిన్సిపాల్ ఆచార్య డాక్టర్ ఎస్ మాణిక్యరావు అధ్యక్షతన, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ వైద్యుల సంఘం సన్మాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు.
ఈ కార్యక్రమంలో మంచి శ్రీధర్ రావు చేసిన సేవలను గురించి ప్రిన్సిపాల్ డాక్టర్ ఎస్ మాణిక్యరావు మాట్లాడుతూ… కోవిడ్ సమయంలో డాక్టర్ మంచి శ్రీధర్ రావు ప్రాణాలకు తెగించి అత్యుత్తమమైన సేవలను అందించారని, బ్లాక్ ఫంగస్ బారిన పడిన రోగులకు ఆపరేషన్ నిర్వహించి వారికి జీవితాన్ని ప్రసాదించారని, తను ఈరోజు పదవీవిరమణ చెందడం ఈ ఎన్ టి విభాగానికి తీరని లోటు అని తెలిపారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ వైద్యుల సంఘం అధ్యక్షులు డాక్టర్ రామస్వామి నాయక్ మాట్లాడుతూ… రోగుల పట్ల అత్యంత ప్రేమతో, వైద్యం అందించడం, ఎవర్ని నొప్పించకుండా, అత్యుత్తమ ఫలితాలు తీసుకురావడంలో, తన వృత్తి ధర్మాన్ని త్రికరణ శుద్ధి గా నిర్వర్తించడం శ్రీధర్ రావు నైపుణ్యమని తెలిపారు. ఆచార్య డాక్టర్ మంచి శ్రీధర్ రావును వారి శ్రీమతి పేథాలజీ ప్రొఫెసర్ ఆచార్య డాక్టర్ శైల ను డాక్టర్లు ఘనంగా సన్మానించారు. సన్మాన గ్రహీత డాక్టర్ మంచి శ్రీధర్ రావు మాట్లాడుతూ అనంత వైద్య కళాశాలలో ఐదు సంవత్సరాల పాటు పని చేయడం చాలా ఆనందాన్ని కలిగించిందని, తోటి సహచర డాక్టర్లు స్నేహం, సాయం, సమన్వయం మరువలేనివని తెలిపారు. ఈ సమావేశంలో పూర్వ ప్రభుత్వ సర్వజన ఆసుపత్రి సూపర్ ఇంటెండెంట్ ఆచార్య డాక్టర్ నవీద్ అహ్మద్, వైస్ ప్రిన్సిపాల్ లు నవీన్ కుమార్, షారోన్ సోనియా, శంషాద్ బేగం, తెలుగు మధుసూదన్, సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి డిప్యూటీ సూపరింటెండెంట్ డాక్టర్ సుబ్రహ్మణ్యం, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ వైద్యుల సంఘం కోశాధికారి డాక్టర్ వైఎంస్ ప్రసాద్, ఇతర డాక్టర్లు,డాక్టర్ కె కొండయ్య,డాక్టర్ సైదన్న,డాక్టర్ వేముల శ్రీనివాసులు,డాక్టర్ మనోరాజ్,డాక్టర్ ప్రేమ్ కుమార్,డాక్టర్ జావేద్,డాక్టర్ ఎన్ శ్రీధర్,డాక్టర్ భీమసేనాచారి, డాక్టర్ సుచిత్ర శౌరి, డాక్టర్ రామస్వామి, డాక్టర్ శివ శంకర్ నాయక్, డాక్టర్ షబానా, ఎన్ ఎస్ ఎస్ ప్రోగ్రామ్ ఆఫీసర్ డాక్టర్ ఆదిరెడ్డి పరదేశి నాయుడు తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img