విశాలాంధ్ర -తనకల్లు : పారిశ్రామిక అభివృద్ధితోనే ప్రాంతాల అభివృద్ధి సాధ్యమని గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్ మెంబర్ డాక్టర్ ముక్తియార్ భాష అభిప్రాయపడ్డారు. తనకల్లు మండలం మల్రెడ్డిపల్లి పంచాయతీ పెద్దపల్లి గ్రామ నివాసి అయిన డాక్టర్ ముక్తియార్ బాషా అంచలంచలుగా ఎదుగుతూ నేడు మంచి పదవిలో కొనసాగుతూ తను పుట్టిన ప్రాంతం తో పాటు నియోజకవర్గానికి కూడా తన వంతు సహాయ సహకారాలు అందించడానికి ముఖ్యంగా యువతకు ఉపాధి మహిళలకు ఉపాధి ఈ ప్రాంతంలో పరిశ్రమల ఏర్పాటుకు రూపకల్పనతో పాటు స్థాపన చేపడతామన్నారు. వెనుకబడిన ప్రాంతాలను అభివృద్ధి చేయడంతో పాటు ఇప్పటికే గ్రామంలో అవసరమైన మౌలిక సదుపాయాలతో పాటు ఏ కష్టం వచ్చినా సహాయం చేయడానికి ముక్తియార్ భయ్యా ఉన్నాడనే నమ్మకాన్ని ప్రజల్లో నాటాడు.ఆయన ఎప్పుడైనా గ్రామానికి వచ్చినప్పుడు ఆయనతో సహాయం పొందిన వారితో సహా గ్రామలో నెలకొన్న సమస్యలకు సహాయం కావాలని పిల్లల చదువులు మౌలిక వసతుల కల్పన ఇలాంటి తదితర విషయాలను తెలపడానికి వందల సంఖ్యలో విన్నవించుకోవడం పరిపాటిగా మారింది ఇప్పటికే గ్రామంలో అనేక మౌలిక వసతు లతోపాటు కనీస సౌకర్యాలు కల్పించినట్లు గ్రామస్తులు తెలుపుతున్నారు.దేశంలోనే అనేక సేవా కార్యక్రమాలు చేపడుతున్న విశ్వశక్తి సంస్థ గురూజీ రాజ్ కుమార్ నాయుడు, భయ్యా తో పాటు గ్రామానికి విచ్చేశారు త్వరలో విశ్వశక్తి సంస్థ ద్వారా సేవా కార్యక్రమాలతో పాటు అవసరమైన ఏ కార్యక్రమాన్నైనా చేపట్టేందుకు సిద్ధంగా ఉన్నామని గురూజీ తెలిపారు. ఈ మండలం తో పాటు ఇతర మండలాల్లో కూడా గ్రామాలలో పర్యటనలు చేపట్టి అవసరమైన పనులకు శ్రీకారం చుట్టడానికి సిద్ధంగా ఉన్నామన్నారు. ఆయా గ్రామాలలో చేపట్టవలసిన పనులను ఇక్కడ అవసరమైన పరిశ్రమలను తేవడానికి కేంద్ర మంత్రులతో సంప్రదింపులు జరుగుతున్నాయని త్వరలో ప్రణాళికలు సిద్ధం చేసి మొదలు పెడతామన్నారు. ప్రతి ఒక్కరికి పని కల్పించి ప్రాంతాల అభివృద్ధి చేయడమే లక్ష్యంగా పనిచేస్తామన్నారు ముఖ్యంగా రైతులకు చేపట్టవలసిన కార్యక్రమాలను ప్రభుత్వాల సహకారంతో చేపట్టి ఆదుకుంటామన్నారు