ఎస్.ఈ. బి సీఐ. గురు ప్రసాద్
విశాలాంధ్ర – ధర్మవరం : మత్తు పదార్థాల వినియోగం వలన జీవితాలే నాశనమవుతాయని ఎస్. ఈ. బి.. సి ఐ. గురు ప్రసాద్ తెలిపారు. ఈ సందర్భంగా పట్టణంలోని ప్రభుత్వ బాలుర జూనియర్ కళాశాలలో విద్యార్థులకు అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి కళాశాల ప్రిన్సిపాల్ ప్రశాంతి అధ్యక్షతన జరిగింది. అనంతరం వారు మాట్లాడుతూ మత్తు పదార్థాలు మాదకద్రవ్యాల వినియోగం వాటివల్ల కలుగు దుష్పరిమాణాలు గూర్చి, అదేవిధంగా కలుగునష్టాలు విద్యార్థులకు వివరించడం జరిగిందని తెలిపారు. ప్రజలు మత్తు పదార్థాలకు అలవాటు పడ్డారంటే సమాజం తిరోగమనములో పయనిస్తుందని తెలిపారు. అలాంటి చోట సామాజిక, మానసిక, శారీరక, అనారోగ్యాలు తలెత్తుతాయని తెలిపారు. అంతేకాకుండా మన దేశంలో ముఖ్యంగా యువత లో మాదకద్రవ్యాల దుర్వినియోగం పెరుగుతోందని, ఇది ఆందోళన కలిగించే విషయంగా ప్రతి ఒక్కరూ గ్రహించాలని తెలిపారు. అందుకే ప్రతి ఒక్కరూ డ్రక్షకు దూరంగా ఉంటూ ఆరోగ్యవంతమైన జీవితాన్ని గడపాలని తెలిపారు. అనంతరం ప్రిన్సిపాల్ ప్రశాంతి మాట్లాడుతూ విద్యార్థులుగా ఉన్న మీరు భవిష్యత్ పౌరులుగా సమాజంలో రాణించాలంటే ఇప్పటినుంచే మాదక ద్రవ్యాలకు దూరంగా ఉండాలని, జీవితాలను మారకద్రవ్యాల వ్యసనంలో పడి అంధకారం చేసుకోకూడదని వివరించారు. ఈ కార్యక్రమంలో సబ్ ఇన్స్పెక్టర్ శ్రీధర్ బాబు, కళాశాల ప్రిన్సిపాల్ ప్రశాంతి, ఎన్ఎస్ఎస్ ప్రోగ్రాం ఆఫీసర్ కుళాయి రెడ్డి, సెబ్ సిబ్బంది, అధ్యాపకులు పాల్గొన్నారు.