విశాలాంధ – జేఎన్టీయూ ఏ: ఫోటో సమాజంలో ఎదుర్కొంటున్న ఎన్నో రుగ్మతలకు మార్పు, నివారణ మార్గాలను చూపగలిగే అద్భుత ఛాయాచిత్ర రూపకల్పన అని మి ట్స్ ఇంజనీరింగ్ కళాశాల ప్రిన్సిపల్ డా..యువరాజ్ పేర్కొన్నారు. సోమవారం అంతర్జాతీయ ఫోటోగ్రఫీ డే ను కళాశాలలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రిన్సిపల్ మాట్లాడుతూ.. అలనాటి మధుర జ్ఞాపకాలు, సంతోషం, బావ వ్యక్తీకరణ, ప్రకృతిలో చోటు చేసుకుంటున్నా ఉట్టిపడేలా.. ఛాయాచిత్రాలు ఎందరును అలరిస్తూ.. పదులంగా నిలుస్తూ ఉన్నాయన్నారు. అనంతరం కళాశాలలోని విద్యార్థులకు నైపుణ్యాన్ని వెలికి తీసేందుకు ఫోటోగ్రఫీ ఫోటోలను నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కోఆర్డినేటర్ రియాజ్ అలీ, విద్యార్థులు పాల్గొన్నారు.