విశాలాంధ్ర : తల్లిపాల వారోత్సవాలు ముగింపు సందర్భంగా గురువారం ప్రభుత్వ సర్వజన వైద్యశాల నందు పీడియాట్రిక్ వార్డులో గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ ప్రిన్సిపల్ డాక్టర్ మాణిక్యరావు, ప్రభుత్వ వైద్యశాల సూపరింటెండెంట్ డాక్టర్ వెంకటేశ్వరరావు ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ…, తల్లిపాల ప్రాముఖ్యత గురించి తల్లులకు వివరించారు. పోస్టర్ ప్రజెంటేషన్ లో ప్రతిభ కనబరిచిన గవర్నమెంట్ నర్సింగ్ కళాశాల విద్యార్థినులకు,, తల్లిపాల వారోత్సవాల సందర్భంగా వ్యాసరచన పోటీల్లో విజేతలైన ఎంబిబిఎస్ విద్యార్థులకు, పోస్ట్ గ్రాడ్యుయేట్ విద్యార్థులకు క్విజ్ కాంపిటీషన్ నిర్వహించి విజేతలకు, తల్లిపాల ప్రాముఖ్యత గురించి మంచి అవగాహన ఉన్న తల్లులకు బహుమతులు అందజేశారు. ఈ కార్యక్రమంలో పీడియాట్రిక్ విభాగాధిపతి డాక్టరు రవికుమార్, గైనకాలజీ విభాగం ప్రొఫెసర్ డాక్టర్ సంధ్య, చిన్నపిల్లల విభాగం సిబ్బంది పాల్గొనడం జరిగినది.