విశాలాంధ్ర -పామిడి (అనంతపురం జిల్లా) : విద్యుత్ స్తంభాలకు చెట్ల కొమ్మలు అల్లుకున్నాయి.పామిడి మండలంలోని పి కొండాపురం గ్రామం ఎస్సీ కాలనీలో స్తంభాలకు చెట్ల కొమ్మలు పెద్ద ఎత్తున కప్పి వేశాయి దీంతో తరచూ విద్యుత్ సరఫరాకు అంతాయం కలుగుతోంది.గాలి వీచినా, వర్షం పడినా ప్రమాదాలు జరిగే అవకాశం ఉంది. నియంత్రిక పక్క నుంచి నిత్యం ప్రజలు మేకలు గొర్రెలు వాహనదారులు రాక పోకలు సాగిస్తుంటారు. మరమ్మతు కోసం స్తంభాలు ఎక్కే పరిస్థితి లేకుండా పోతోంది. నిత్యం విద్యుత్ అధికారులు సిబ్బంది చూస్తున్నారే తప్ప తొలగించడం లేదు. కొన్నేళ్లుగా ఇదే సమస్యతో విద్యుత్ వినియోగదారులు ఇబ్బందులుపడుతున్న సంబంధిత అధికారులు పట్టించుకోవడం లేదు.