విశాలాంధ్ర-తాడిపత్రి: ప్రతి ఒక్క ఉద్యానవన రైతు ఈ క్రాఫ్ ద్వారా పంట నమోదు చేయించుకోవాలని ఉద్యానవన శాఖ అధికారి ఎస్. ఉమాదేవి రైతులకు సూచించారు. బుధవారం పట్టణంలోని ఉద్యానవన శాఖ కార్యాలయంలో విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడుతూ తాడిపత్రి డివిజన్లోని ఉద్యానవన పంటలు తాడిపత్రి మండలంకు దాదాపు 4,420 ఎకరాలు, పెద్ద పప్పూరు 9,100 ఎకరాలు, యాడికి 5,500 ఎకరాలు రైతులు సాగు చేస్తున్నారన్నారు. రైతులు తమ గ్రామాలలో ఉన్న రైతు సేవ కేంద్రాలలో పనిచేసే గ్రామ ఉద్యాన సహాయకులు, గ్రామ వ్యవసాయ సహాయకులను కలసి భూమికి సంబంధించిన పట్టా పాసు బుక్, బ్యాంక్ అకౌంట్, ఆధార్ కార్డు జిరాక్స్ లను వారికి ఇచ్చి తమ పంటలకు సంబంధించిన పంటల నమోదు చేయించుకోవాలన్నారు. ఈ పంటల నమోదు వల్ల ఉద్యానవన శాఖ ద్వారా రైతులకు అందించే సబ్సిడీలు, ఆదాయ సర్టిఫికెట్లు మరి ఇతర సేవలు పొందాలంటే పంట నమోదు తప్పక చేయించుకోవాలన్నారు రైతులను కోరారు.