-ఎమ్మెల్యే పరిటాల సునీత, పరిటాల శ్రీరామ్
విశాలాంధ్ర-రాప్తాడు : పర్యావరణ పరిరక్షణ కోసం ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి, వాటిని బాధ్యతగా పెంచాలని ఎమ్మెల్యే పరిటాల సునీత, ధర్మవరం టీడీపీ ఇంచార్జి పరిటాల శ్రీరామ్ పిలుపునిచ్చారు. రామగిరి మండలం ఎంజేపీ బాలికల పాఠశాలలో డ్వామా, అటవీ శాఖల ఆధ్వర్యంలో శుక్రవారం వనమహోత్సవం కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి పరిటాల సునీత, పరిటాల శ్రీరామ్ ముఖ్య అతిథులుగా హాజరై పాఠశాల ఆవరణంలో మొక్కలు నాటారు. వారు మాట్లాడుతూ అనంతపురం జిల్లా వంటి కరవు ప్రాంతంలో ప్రతి ఒక్కరు మొక్కలు నాటాలన్నారు. మన ప్రాంతంలో అటవీ విస్తీర్ణం చాలా తక్కువగా ఉన్నందువలన వర్షాలు కూడా సరిగా కురవడం లేదన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో కూడా మొక్కలు నాటాల్సిన అవసరం చాలా ఉందని అభిప్రాయపడ్డారు. చాలామంది మొక్కలు నాటడంతో తమ పని అయిపోయిందని భావిస్తారని కానీ… మొక్కలు నాటడంతో పాటు వాటిని సంరక్షించాల్సిన బాధ్యత కూడా తీసుకోవాలన్నారు.