విశాలాంధ్ర – ధర్మవరం : పర్యావరణ పరిరక్షణ కోసం ప్రతిఒక్కరూ మట్టి వినాయకులనే ప్రతిష్టించాలని టీడీపీ మాజీ ఎస్సీసెల్ అధ్యక్షుడు దారా పోతలయ్య తెలిపారు. స్థానిక రూరల్ పోలీస్ స్టేషన్లో మాజీ ఎస్సీసెల్ అధ్యక్షుడు దారా పోతలయ్య, నాయకులు వేణుగోపాల్రెడ్డి, చండ్రాయుడు, నాగరాజు, ఆనంద్, ఇస్మాయిల్, గిరిరాజు, దారా మల్లికార్జునలు రూరల్ ఎస్సై. నరేంద్రను శాలువాలతో సత్కరించి మట్టివినాయక విగ్రహాలను అందించారు. అనంతరం స్టేషన్లోని సిబ్బందికి మట్టి వినాయకులను పంపిణీ చేశారు. మట్టి వినాయక పంపిణీ పట్ల పోలీస్ స్టేషన్ సిబ్బంది కృతజ్ఞతలు తెలియజేశారు.