8800 దక్కించుకున్న గంగాధర
విశాలాంధ్ర -తనకల్లు : మండల కేంద్రంలోని బ్యాంకు వీధిలో ప్రతి సంవత్సరం గణనాధుని ప్రతిష్టించి భక్తిశ్రద్ధలతో పూజలు ఆచరించడం ఆనవాయితీగా కొనసాగుతోంది. ఈ సంవత్సరం కూడా నిబంధనలను అనుసరించి గణనాథుని ప్రతిష్టించి పూజలు కొనసాగించారు గణనాథుని లడ్డు వేలం వేయగా ఇగువిండ్ల గంగాధర 8800కు వేలంపాట ద్వారా దక్కించుకున్నారు. ఈ కార్యక్రమంలో బ్యాంకు వీధి యువకులతో పాటు ప్రజలు పాల్గొన్నారు.