-ఎమ్మెల్యే పరిటాల సునీతకు వినతి
విశాలాంధ్ర- రాప్తాడు : నియోజకవర్గ కేంద్రం రాప్తాడు గ్రామంలో ఉన్న స్మశాన వాటిక భూమిని కొలతలు వేయించి హద్దులు ఏర్పాటు చేయించాలని ఎమ్మెల్యే పరిటాల సునీతను
రాప్తాడు సర్పంచ్ సాకే తిరుపాల్, కన్వీనర్ పంపు కొండప్ప కోరారు. ఈమేరకు రాప్తాడు ఎంపీడీఓ కార్యాలయంలో బుధవారం ఆమెకు వారు వినతి పత్రం అందజేశారు. గ్రామంలో జనాభా ఎక్కువగా ఉందని, ఎవరైనా మృతి చెందినప్పుడు మృతదేహాలను పూడ్చడానికి స్థలం లేక ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారన్నారు. రెవెన్యూ రికార్డుల్లో ఉన్న మేరకు స్మశాన వాటిక స్థలాన్ని కొలతలు వేయించి హద్దులు ఏర్పాటు చేయించి చుట్టూ కంచె వేయించాలని కోరారు.