విశాలాంధ్ర-తాడిపత్రి : స్థానిక తహసిల్దార్ కార్యాలయం వద్ద సోమవారము సిపిఐ నియోజకవర్గ కార్యదర్శి టి.రంగయ్య ఆధ్వర్యంలో టాక్సీ, ఆటో, బీడీ, నాపరాల్ల కార్మికులకు, వ్యవసాయ కూలీలకు ఇంటి స్థలాలు ఇవ్వాలని ధర్నా నిర్వహించి ఉప తాసిల్దార్ ఆంజనేయ ప్రసాద్ కు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మండలంలోని చల్లవారి పల్లి గ్రామ రెవెన్యూ పోలం సర్వే నెంబర్ 123, సజ్జలదిన్నె గ్రామ రెవెన్యూ పొలంలో ఉన్న ప్రభుత్వ స్థలం, వంక భూములలో రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులు ప్రభుత్వ భూమిని ఆక్రమించుకుని రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నారు. ఆక్రమణకు గురైన ప్రభుత్వ భూమిని స్వాధీనం చేసుకొని ఇల్లు లేని నిరుపేద కార్మికులందరికీ ఇళ్ల స్థలాలు కేటాయించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సిపిఐ మండల కార్యదర్శి నాగ రంగయ్య కౌలు రైతు సంఘం జిల్లా అధ్యక్షుడు వీటి.రామాంజనేయులు రైతు నాయకులు నారాయణరెడ్డి సిపిఐ నాయకులు గోపాలకృష్ణ, సురేష్ ట్యాక్సీ యూనియన్ లీడర్లు సుబ్బరాయుడు పుల్లయ్య పాల్గొన్నారు.