London Escorts sunderland escorts asyabahis.org www.dumanbet.live www.pinbahiscasino.com sekabet.net olabahisgir.com www.maltcasino.net www.faffbet-giris.com www.asyabahisgo1.com dumanbetyenigiris.com pinbahisgo1.com www.sekabet-giris2.com olabahisgo.com www.maltcasino-giris.com www.faffbet.net betforward1.org betforward.mobi www.1xbet-adres.com 1xbet4iran.com www.romabet1.com www.yasbet2.net 1xirani.com romabet.top 3btforward1.com 1xbet 1xbet-farsi4.com بهترین سایت شرط بندی betforward
Sunday, October 13, 2024
Sunday, October 13, 2024

ఎన్ ఎ బి హెచ్ అక్రిడేషన్ దిశగా ప్రభుత్వ సర్వజన ఆసుపత్రి

ప్రభుత్వ సర్వజన ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ కె ఎస్ ఎస్ వెంకటేశ్వరరావు

విశాలాంధ్ర – అనంతపురం : అనంతపురం ప్రభుత్వ సర్వజన ఆసుపత్రి నందు ఎన్ ఏ బీ హెచ్ అక్రిడేషన్ కి సంబంధించి అన్ని విభాగాధిపతులతో ప్రభుత్వ సర్వజన ఆస్పత్రి సూపర్డెంట్ డాక్టర్ కె ఎస్ ఎస్ వెంకటేశ్వరరావు గురువారం సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రభుత్వ సర్వజన ఆసుపత్రికి ఎన్ ఏ బి హెచ్ అక్రిడేషన్ కు అవసరమగు విధి, విధానాలు, పరికరాలకు సంబంధించి అన్ని విభాగాధిపతులతో చర్చించారు. వాటికి సంబంధించిన పరిష్కార మార్గాలు చర్చించడం జరిగింది. ప్రతి విభాగం నందు ఒక నోడల్ ఆఫీసర్ ని గుర్తించి, కమిటీ ఫామ్ చేయడం జరుగుతుందన్నారు. ఈ కమిటీ తమ తమ విభాగాల సమస్యలు మరియు ఎన్. ఏ బి హెచ్ కావలసిన స్టాండర్డ్స్ ను అమలు పరచడానికి తగిన కసరత్తు చేయవలసిందిగా కోరారు. వారు ఇచ్చే సూచనలు మరియు పరిశీలనలు వచ్చే సమావేశంలో చర్చించాలని నిర్ణయించడం జరిగిందన్నారు. తదుపరి సమావేశం ఈనెల 18వ తారీఖున నిర్వహించబడుతుంది. ఎన్ ఏ బీ హెచ్ అక్రిడేషన్ ద్వారా రోగి భద్రత మరియు హక్కులు, సంక్రమణ నియంత్రణ, మందుల నిర్వహణ, సిబ్బంది అర్హతలు మరియు శిక్షణ, మౌలిక సదుపాయాలు మరియు పరికరాలు, నిరంతర నాణ్యత మెరుగుదల వంటి అంశాల మీద ప్రాధాన్యత ఇవ్వబడుతుందన్నారు . ఎన్ ఎ బి హెచ్ అక్రిడేషన్ సాధించడం ద్వారా ఆరోగ్య సంరక్షణ ప్రదాతలు, తమ రోగులకు అధిక నాణ్యత సురక్షితమైన మరియు సమర్థవంతమైన సంరక్షణను అందించడంలో తమ నిబద్ధతను ప్రదర్శిస్తారు అని పేర్కొన్నారు. ఈ సమావేశంలో ప్రభుత్వ వైద్య కళాశాల ఇన్చార్జి ప్రిన్సిపాల్ డాక్టర్ నవీన్ కుమార్, హెచ్ ఓ డి హాస్పిటల్ అడ్మినిస్ట్రేషన్ డాక్టర్ శ్రీనివాస్ శౌరి, జనరల్ సర్జరీ హెచ్ ఓ డి డాక్టర్ రామస్వామి నాయక్, న్యూరో సర్జరీ హెచ్ ఓ డి డాక్టర్ జి భాస్కర్, ఎమర్జెన్సీ మెడిసిన్ హెచ్ ఓ డి డాక్టర్ శ్రీనివాసులు, డాక్టర్ శంషాద్ బేగం, డాక్టర్ రవి కుమార్, డాక్టర్ సతీష్, డాక్టర్ శాంతి రెడ్డి, డాక్టర్ శివ శంకర్ నాయక్, డాక్టర్ వైఎంఎస్ ప్రసాద్ మరియు అన్ని విభాగాదిపతులు పాల్గొనడం జరిగింది. ఈ సమావేశంలో ఇంచార్జ్ ఆర్ ఎం ఓ డాక్టర్ పద్మజ, డిప్యూటీ ఆర్ ఎం ఓ డాక్టర్ హేమలత, నర్సింగ్ సూపరింటెండెంట్ నాగమణి, ఇన్ఫెక్షన్ కంట్రోల్ నర్సులు మరియు బయో మెడికల్ ఇంజనీర్ సిబ్బంది పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img