విశాలాంధ్ర – జేఎన్టీయూ ఏ: ప్రభుత్వ పాలిటెక్నికల్ కళాశాలలో డిప్లమా కోర్సు విద్యనభ్యసిస్తున్న ఎస్ . నస్రీన్ టిసిఎస్ నిర్వహించిన ప్రాంగణ నియామకాలలో టిసిఎస్ డిజైనర్ ట్రైనింగ్ నియామకానుకు ఎంపికైనట్లు కళాశాల ప్రిన్సిపల్ డా. జయచంద్ర రెడ్డి తెలిపారు. ప్రభుత్వ కళాశాలలు విజయాలకు చిహ్నాలను.. నిరూపించారని ధర్మవరం పట్టణంలో చేనేత కార్మికుడు చాంద్ భాషా తన కూతురుకు ఉద్యోగం రావడంతో సంతోషం వ్యక్తం చేశారు. కళాశాలలో అధ్యాపకుల శిక్షణ, పరిశోదాత్మక అధ్యయనం, పారిశ్రామిక ఉపాధి అవకాశాలు కల్పనాను అందించడం పట్ల హర్షం వ్యక్తం చేశారు. అనంతరం ప్రిన్సిపల్, ఈ ఈ ఈ విభాగధిపతి జి. సుధాకర్ రెడ్డి, అధ్యాపకులు బి. కరుణ కుమార్ , అధ్యాపక బృందం ఎంపికైన విద్యార్థిని అభినందనలు తెలిపారు.