విశాలాంధ్ర పామిడి (అనంతపురం జిల్లా ): పామిడి పట్టణంలో హర్ ఘర్ తిరంగా ర్యాలీ ఘనంగా జరిగింది. ప్రతి భారతీయుడు జాతీయ పతాకాన్ని ఎగురవేయడానికి ప్రోత్సహించడం ద్వారా వారిలో దేశభక్తి, జాతీయతాభావాన్ని, స్ఫూర్తిని పెంపొందించడం కోసం ఉద్దేశించిన హర్ ఘర్ తిరంగా కార్యక్రమంలో భాగంగా బుధవారం ఉదయం టీసీ గవర్నమెంట్ హై స్కూల్ నుంచి విద్యా మందిరం స్కూల్ వరకు 200 ప్రభుత్వ ప్రైవేటు విద్యార్థులు జాతీయ జెండాలను చేత పట్టుకుని ప్రభుత్వ అధికారులు నాయకులు ఆధ్వర్యంలో హర్ ఘర్ తిరంగా ర్యాలీ నిర్వహించారు.ఈ కార్యక్రమం ఆర్ఆర్ రమేష్, శ్రీనివాసరావు, అంజి నాయక్, రాజశేఖర్ గౌడ్, కుమార్,ప్రభుత్వ అధికారులు, నాయకులు తరితరులు పాల్గొన్నారు.