విశాలాంధ్ర – అనంతపురం : భారత ప్రభుత్వ పర్యావరణ, అటవీ మరియు వాతావరణ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యవంలో “ఏక్ పేడ్ మా కే నామ్” కార్యక్రమం కింద మంగళవారం ఆంధ్ర ప్రదేశ్ కేంద్రీయ విశ్వవిద్యాలయం ఒక రోజు ప్లాంటేషన్ డ్రైవ్‌ను ఉపకులపతి, ఆచార్య ఎస్. ఏ . కోరి, డీన్, ఆచార్య సి. షీలారెడ్డిల మార్గదర్శకత్వంలో నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ…. సెప్టెంబర్, 2024 నాటికి 80 కోట్ల మొక్కలను నాటడం, 2025 మార్చి నాటికి 140 కోట్ల తోటలను పెంచడం ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం అన్నారు . పర్యావరణ అవగాహనను కల్పించడానికి, క్యాంపస్‌లో పచ్చదనాన్ని పెంపొందించడానికి ఈ కార్యక్రమం నిర్వహించబడింది అన్నారు. చెట్ల పెంపకం ద్వారా క్యాంపస్ వాతావరణాన్ని మెరుగుపరచడానికి చేయవలసిన సమష్టి కృషిలో విశ్వవిద్యాలయాన్ని నిమగ్నం చేయడం ఈ డ్రైవ్ లక్ష్యం అని పేర్కొన్నారు.
“ఏక్ పేడ్ మా కే నామ్” ప్లాంటేషన్ డ్రైవ్ అనేది జంతలూరులోని ఆంధ్ర ప్రదేశ్ కేంద్రీయ విశ్వవిద్యాలయ శాశ్వత ప్రాంగణంలో హరితావరణాన్ని, పర్యావరణ నాణ్యతను పెంపొందించడానికి ఒక గొప్ప అడుగు. విశ్వవిద్యాలయ విద్యార్థులలో పర్యావరణ బాధ్యతను పెంపొందించడం అవుతుందన్నారు. కార్యక్రమంలో ఈ కార్యక్రమంలో రాజనీతి శాస్త్ర బాగా అధ్యాపకులు రామకృష్ణారెడ్డి, ప్లాంటేషన్ కమిటీ సభ్యులు, ఎన్ఎస్ఎస్ సెల్, అధ్యాపకులు, పీహెచ్ .డి . విద్యార్థులు యు.జి, పీజీ విద్యార్థినీ విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొన్నారు.