విశాలాంధ్ర – జేఎన్టీయూ ఏ: శ్రీ విద్యానికేతన్ పాఠశాలలో 78వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలను గురువారం ఘనంగా నిర్వహించారు. అనంతరం పాఠశాల చైర్మన్ ప్రభాకర్, కార్యదర్శి విద్యాసాగర్, అడ్మినిస్ట్రేటర్ కోమలత, ట్రెజరీ విష్ణు, పూల విద్యాసాగర్ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. అనంతరం చిన్నారులు వివిధ సాంస్కృతిక కార్యక్రమాలు అందరినీ అలరించాయి. అనంతరం వారు మాట్లాడుతూ.. స్వాతంత్ర సమరయోధుల స్ఫూర్తిని , నిబద్ధత , నిజాయితీని ప్రతి విద్యార్థి అలవర్చుకోవాలని సూచించారు. వివిధ పోటీలలో గెలుపొందిన విద్యార్థులకు బహుమతులను అందజేశారు. ఈ కార్యక్రమంలో అధ్యాపక బృందం, బోధన, బోధ నేతర ఉద్యోగులు పాల్గొన్నారు.