విశాలాంధ్ర-తాడిపత్రి: పట్టణంలోని రోటరీ క్లబ్ కార్యాలయంలో సోమవారం ఇన్నర్ వీల్ క్లబ్ అధ్యక్షురాలు శ్రీమతి కౌసర్ బేగం, సభ్యుల సహకారంతో పుట్లూరు రోడ్డులోని శ్రీవాణి స్మార్ట్ స్కూల్ నందు పిల్లలకు శ్రీకృష్ణ, గోపికల వేషధారణలు వేయించి నృత్య ప్రదర్శన పోటీలు నిర్వహించి, విజేతలకు బహుమతులు అందించినట్లు ఇన్నర్ వీల్ క్లబ్ అధ్యక్షురాలు కౌసర్ బేగం చెప్పారు. ఈ కార్యక్రమంలో శ్రీ వాణి స్మార్ట్ స్కూల్ ప్రిన్సిపల్ రవికుమార్, సిబ్బంది, ఇన్నర్ వీల్ క్లబ్ సభ్యులు అరుణ రెడ్డి, లలిత, సవేరా, కౌసర్, రాగిణి పాల్గొన్నారు.