సిపిఐ పార్టీ శాఖ కార్యదర్శి మునాఫ్
విశాలాంధ్ర – అనంతపురం : అనంతపురము నగర పాలక సంస్థ పరిధిలోని 40వ డివిజన్ పార్వతమ్మ కాలనీలో 20 ఏళ్ళకు పైగా 130 కుటుంబాలు నివాసం వుంటున్న పేదలకు ఇంటిపట్టాలు మంజూరు చేయవలసినదిగా ఎమ్మార్వో హరికి బుధవారం వినతిపత్రం అందజేశారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ .. వీరందరు రేషన్కార్డు, ఓటరు కార్డు, ఆధార్కార్డు కల్గి వున్నారు.
నీటి పన్ను, కరెంటు బిల్లులు, ఇంటి గుత్తలు కూడా చెల్లిస్తున్నారు.
కావున పై తెలిపిన 130 కుటుంబాలకు ఇంటిపట్టాలు మంజూరు చేయవలసినదిగా కోరారు. ఈ కార్యక్రమంలో నగర సహకార దర్శి అలిపిర, శాఖ కార్యదర్శి రాంబాబు తదితరులు పాల్గొన్నారు.