విశాలాంధ్ర -పామిడి : అనంతపురం జిల్లాలో గుంతకల్లు నియోజకవర్గం వైసీపీ లో మరోసారి భగ్గుమన్న విబేధాలు బీసీ లను ఎమ్మెల్యే వెంకటరామిరెడ్డి అడుగడుగునా అవమానిస్తున్నారంటు మాజీ ఏ డి సి సి బ్యాంక్ చైర్మన్ పామిడి వీరా ఆవేదన
పామిడి పట్టణం లో బుధవారం వై.యస్. ఆర్ ఆసరా కార్యక్రమం లో భాగంగా ఎమ్మెల్యే వెంకటరామిరెడ్డి ప్రసంగం తర్వాత ఇంకెవరు మాట్లాడడానికి లేదంటూ కార్యక్రమం ముగించేందుకు చుసిన ఎమ్మెల్యే బీసీ ల మీటింగ్ కి పిలిచి బీసీ లకు మాట్లాడే అవకాశం ఇవ్వడం లేదని బీసీ లకు మాట్లాడే అవకాశం ఇవ్వాలని మాజీ ఏ డి సి సి బ్యాంక్ చైర్మన్ పామిడి వీరా గారు కోరగా ఇక్కడ ఎవ్వరు మాట్లాడకూడదు అని ఎమ్మెల్యే గారు చెప్పడం తో మాకెందుకు అవకాశం ఇవ్వరు అంటూ స్టేజ్ పైనే బహాభాహికి దిగిన పామిడి వీరాని ఏయ్ ముందు నువ్వు పోవయ్యా అంటూ అవమాణించిన ఎమ్మెల్యే ఎమ్మెల్యే వెంకటరామిరెడ్డి. బీసీ ల ఓట్లతో గెలిచి బీసీ లను అవమానిచడం ఏంటని ప్రశ్నించిన పామిడి వీరాని పక్కకు తీసుకెళ్లిపోయిన పోలీసులు. బీసీ ల నియోజకవర్గం లో ఎమ్మెల్యే బీసీ లకు ప్రాధాన్యత ఇవ్వడం లేదని కార్యకర్తల ఆవేదన….