విశాలాంధ్ర -రాయదుర్గం : గుప్తునిధుల ముఠా సభ్యులు అయిదు మందిని అరెస్ట్ చేసినట్టు డిఎస్పి రవికుమార్ తెలిపారు, బుధవారం స్థానిక పోలీస్ స్టేషన్ ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ జిల్లా ఎస్పి ఆదేశాలు మేరకు మంగళవారం రాత్రి 7 గంటల సమయంలో రాయదుర్గం అర్బన్ సర్కిల్ ఇన్స్పెక్టర్ యం. శ్రీనివాసులు తో పాటు పోలీస్ సిబ్బంది రాయదుర్గం బళ్ళారి రోడ్డు నందు కుంటి మారెమ్మ గుడి వద్ద వాహనాలు తనిఖీ చేస్తుండగా రాయదుర్గం వైపు నుండి KA50P7097 నంబర్ గల కారులో ఆరు మంది ముఠా సభ్యులు ఉన్నారు, అనంతపురం కు చెందిన గంజికుంట విజయ్ కుమార్, మిడుతురు గ్రామానికి చెందిన చాల్లా శివ శంకర్, మిడుతూరు గ్రామానికి చెందిన బోయ వెంకటేషులు, రాయదుర్గం పట్టణానికి చెందిన నబి ఖాన్, రాయదుర్గం పట్టణానికి చెందిన షేక్ వన్నూర్ వలి,వారి తో పాటు కారులో ఒక చిన్న వంట గ్యాస్ సిలిండర్, ఒక ఆక్సిజన్ సిలిండర్, ఒక గ్యాస్ కట్టర్, ఇనుప గునపాలు, సుత్తెలు మరియు ఇనుప ఉలిలు పెట్టుకొని,ఒక గ్యాంగ్ ముఠా గా ఏర్పడి,ఏలాగైనా ఎదో ఒక ఆలయంలో గుప్త నిధులను తీయాలని, ఆ సమయంలో అక్కడ ఎవరైనా ఆటంకం కలిగిస్తే వారిని మారణాయుధాలతో దాడి చేసైనా సరే గుప్త నిధులను దోపిడీ చేయాలనీ కుట్ర పన్నుతూ కర్ణాటక రాష్ట్రం,అశోక సిద్దాపురం వైపు పోతుండగా ముగ్గురు ముద్దాయిలను పట్టుకోగా,మిగిలిన ముగ్గరు ముద్దాయిలు తప్పించుకొని పారిపోయినారు.ఆ ముఠా సభ్యుల గ్యాంగ్ లో వున్న రాయదుర్గం పట్టణానికి చెందిన ఇద్దరు ముద్దాయిలను కూడా బుధువారం ఉదయం 11.30 గంటలకు వైస్సార్ సర్కిల్, రాయదుర్గం టౌన్ లో అరెస్ట్ చేశారు.గుప్తునిధులు ముఠా సభ్యుల నుండి ఒక్క కారు,గ్యాస్ కట్టర్, చిన్న గ్యాస్ సిలిండర్, రెండు ఇనుప గునపాలు, మూడు ఇనుప సుత్తెలు మరియు ఆరు ఇనుప ఉల్లిలు స్వాధీనం చేసుకున్నారు, మొన్న రాయదుర్గం మండల పరిధిలోని చదం గ్రామంలో వెలిసిన లింగాల బండ ఆలయం లో గుప్తునిధుల కోసం నంది విగ్రహాలను ధ్వంసం చేసిన ఘటనలో వీరి ప్రమేయం లేదని డీఎస్పీ తెలిపారు,త్వరలో వారిని కూడా పట్టుకుంటామని డీఎస్పీ ఆశబావం వ్యక్తం చేశారు.