Free Porn
xbporn

https://www.bangspankxxx.com
Sunday, September 15, 2024
Sunday, September 15, 2024

78వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు పేదల సేవలో అందరూ అనుసంధానం కావాలి….

జిల్లాలో అన్నా క్యాంటీన్ల ప్రారంభం…

9 గంటల పాటు వ్యవసాయ విద్యు సర్వీస్ లకు సరఫరా…

పాత ఇసుక విధానాన్ని రద్దు….

మంత్రి పయ్యావుల కేశవ్

విశాలాంధ్ర -అనంతపురం : సమరయోధుల పోరాట బలం అమరవీరుల త్యాగఫలంమే బ్రిటిష్ పాలకుల పై తిరుగులేని విజయమే మన స్వాతంత్రమని భారతావని సంకెళ్ళను తెంచుకొని నేటికీ 77 ఏళ్ల పూర్తి చేసుకుని, 78 వ సంవత్సరంలో అడుగు పెడుతున్న శుభవేళ ప్రజలందరికీ హృదయపూర్వక శుభాకాంక్షలను రాష్ట్ర ఆర్థిక, ప్రణాళిక వాణిజ్య పన్నులు, శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ తెలియజేశారు. స్థానిక పోలీస్ పెరేడ్ గ్రౌండ్లో గురువారం 78వ భారత స్వాతంత్ర దినోత్సవ సందర్భంగా వేడుకల్లో ముఖ్య అతిథిగా పాల్గొని మంత్రి జాతీయ పతాకావిష్కరణ చేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీ అంబికా లక్ష్మీనారాయణ, జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్, అర్బన్ ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్, జిల్లా ఎస్పీ కేవీ మురళీకృష్ణ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ… అతి తక్కువ ధరకే నిరుపేదలకు నాణ్యమైన భోజన సదుపాయం జిల్లాలో అన్న క్యాంటీన్ ద్వారా కల్పించేందుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు. జిల్లాలో ఉన్న రెండు లక్షల 12 వేల 452 వ్యవసాయ విద్యుత్ సర్వీసులకు ప్రతిరోజు 9 గంటల పాటు విద్యుత్ సరఫరా చేస్తున్నామన్నారు. ప్రజలకు భారంగా మారిన పాత ఇసుక విధానాన్ని రద్దుచేసి ఉచిత ఇసుక విధానాన్ని అమలు చేస్తున్నామన్నారు. 2024-25 ఆర్థిక సంవత్సరంలో పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లో ఇప్పటివరకు 2 వేల 707 స్వయం సహాయక సంఘాలకు బ్యాంకు అనుసంధానం ద్వారా 224 కోట్ల 18 లక్షల రుణాలు మంజూరు చేశామన్నారు. స్త్రీ నిధి పథకం కింద స్వయం సహాయక సభ్యులకు 37 కోట్ల 32 లక్షల రుణాలు అందించామన్నారు. చంద్రన్న బీమా కింద 5 లక్షల 93 వేల 415 కుటుంబాలు నమోదు అయ్యాయి అన్నారు. షెడ్యూల్ కులాలు, షెడ్యూల్ తెగల, వెనుకబడిన తరగతుల వారి సంక్షేమం కోసం ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. మహిళా శిశు సంక్షేమంలో భాగంగా 2 వేల 302 అంగన్వాడి కేంద్రాల్లో ఈ ఏడాది జూలై నాటికి 49 కోట్ల 21 లక్షల రూపాయలతో ఒక లక్ష 78 వేల 954 మందికి పౌష్టికాహారాన్ని అందించడం జరిగిందన్నారు. పీఎం కిసాన్ పథకం కింద 2024-25 వ ఏడాది మొదటి విడతగా జిల్లాలో 2 లక్షల రెండు లక్షల 77 వేల రైతు కుటుంబాలకు 555 కోట్ల 89 లక్షలను వారి ఖాతాలో జమ చేశామన్నారు. జిల్లాలో 451 రైతు సేవా కేంద్రాల ద్వారా ఈ ఏడాది ఇప్పటివరకు 4 వేల 774 మెట్రిక్ టన్నుల ఎరువులను రైతులకు అందించమన్నారు. క్వింటాల్ వేరుశనగ విత్తనాలను 28 కోట్ల 90 లక్షల రాయితీతో జిల్లాలో అందించామన్నారు. హంద్రీనివా సుజల స్రవంతి ప్రాజెక్టుకు ఈ ఏడాది 40 టీఎంసీ ల నీటిని కేటాయించగా జిల్లాలో చెరువులు నింపేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నామన్నారు. జిల్లాలో 3 వేల 3 కుటుంబాలకు పీఎం ఉజ్వల యువజన పథకం కింద కొత్త గ్యాస్ కనెక్షన్లు పంపిణీ చేశామన్నారు. జలజీవన్ మిషన్ కింద 508 కోట్ల 81 లక్షల ఖర్చుతో 1,633 పనులు మంజూరు చేశామన్నారు. ప్రజారోగ్య సాంకేతిక శాఖ ద్వారా పట్టణ ప్రాంతాల్లో అమృత్ పథకం కింద రక్షిత మంచినీటి సరఫరా కొరకు అనంతపురం, గుంటకల్, తాడిపత్రి పట్టణాలలో 173 కోట్ల 47 లక్షల తో పనులు చేపడుతున్నామన్నారు. మంచి పాలన అంటే సమస్యల పరిష్కారంతోపాటు ప్రజలకు మెరుగైన జీవన ప్రమాణాలు అందించాలన్నారు. రాష్ట్ర ప్రభుత్వ కార్యక్రమాల లక్ష్యసాధనలో కార్యాచరణను వేగవంతం చేసి వివిధ ప్రభుత్వ కార్యక్రమాల ప్రగతి సాధన కోసం జిల్లా కలెక్టర్ వి వినోద్ కుమార్ ఆధ్వర్యంలో కృషి చేస్తున్న జిల్లా యంత్రాంగాన్ని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను అన్నారు. పేదల సేవలో అందరూ అనుసంధానం కావాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ప్రజా ప్రతినిధులు,వివిధ శాఖల అధికారులు,, తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img