విశాలాంధ్ర – శెట్టూరు : గ్రామాల్లో పనిచేసే పారిశుద్ధ్య కార్మికులు ఆరోగ్య పరిస్థితిపై అవగాహన కలిగి ఉండాలని ఇంచార్జ్ ఎంపీడీఓ రఘురామారావు సూచించారు. మండల పరిధిలోని బొచ్చుపల్లి గ్రామ సచివాలయ నందు బుధవారం పారిశుద్ధ్య కార్మికులకు వైద్య పరీక్షలు నిర్వహించారు వైద్య సిబ్బంది మాట్లాడుతూ గ్రామంలో ప్రతి ఒక్కరు కూడా పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకోవాలని పాశుద్ధ కార్మికులు వ్యాధులు రాకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి మల్లికార్జున, కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్ అఖిల , ఏఎన్ఎం రోజా పరిశుద్ధ కార్మికులు గ్రామ సచివాల సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.