విజయవాడ వరద బాధితులకు అండగా నిలబడండి
విరాళాల సేకరణలో పామిడి సిపిఐ పిలుపు
విశాలాంధ్ర- పామిడి: భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ రాష్ట్ర సమితి పిలుపులో భాగంగా పామిడి మండలంలోని దుకాణాలలో, ప్రైవేట్ స్కూల్స్, ప్రభుత్వ ప్రైవేటు ఆఫీస్ లలో, వీధుల్లో, భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ పామిడి మండల సమితి ఆధ్వర్యంలో విరాళాల సేకరణ కార్యక్రమం నిర్వహించారు పామిడి మండలం సమితి ఆధ్వర్యంలో నియోజకవర్గ సమితికి 10463 రూపాయలు నియోజకవర్గ కార్యదర్శి వీరభద్ర స్వామికి అందజేయడం జరిగింది.ఈ కార్యక్రమంలో సిపిఐ నియోజకవర్గ కార్యదర్శి వీరభద్ర స్వామి సిపిఐ సీనియర్ నాయకులు పెద్దవడుగూరు సూర్యనారాయణ రెడ్డి సిపిఐ మండల కార్యదర్శి రహీం నాగరాజు ఏఐఎస్ఎఫ్ నియోజకవర్గ కార్యదర్శి వెంకట్ నాయక్ పాల్గొని వారు విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ ఆకస్మిక వరదల వల్ల నిరాశ్రయులైన విజయవాడ వరద బాధితులకు సిపిఐ అండగా ఉంటుందని తమ వంతు సహాయంగా ప్రజలు తమకు తోచిన సహాయాన్ని అందించి బాధితులకు ఆత్మహస్తైర్యాన్ని అందించాలని ప్రజల అందించే ప్రతి ఒక్క రూపాయి సిపిఐ పార్టీగా బాధితులకు అందజేస్తామని తెలియజేశారు ప్రజలు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి సహాయపడాలని పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో రైతు సంఘం నియోజకవర్గ నాయకులు ఉమర్ భాష ఏఐఎస్ఎఫ్ నియోజకవర్గ కోశాధికారి అఖిల్ సిపిఐ మండల నాయకులు కల్లర్ చౌడప్ప రాజు రైతు సంఘం నాయకులు కోదండరామిరెడ్డి సీనా ప్రసాదు రాముడు తదితరులు పాల్గొన్నారు…..