విశాలాంధ్ర – జేఎన్టీయూ ఏ: పారిశ్రామిక కంపెనీలు ఎదుర్కొంటున్న ఎన్నో సమస్యలకు పరిష్కార మార్గాలను ఆర్టిఫిషల్ ఇంటలిజెన్స్ ఆవిష్కరణలు నాంది కానుందిని వైస్ ప్రిన్సిపల్ అకాడమిక్స్ రామనాథన్ పేర్కొన్నారు. బుధవారం మదనపల్లి ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్ కళాశాలలో కంప్యూటర్ సైన్స్ విభాగం లో ఏఐ, హ్యాకథాన్, స్మార్ట్ ఇండియా ఆవిష్కరణల, సమస్యల పరిష్కార నైపుణ్యాలపై అవగాహన నిర్వహించారు. అనంతరం వైస్ ప్రిన్సిపల్ మాట్లాడుతూ.. నూతన ఆవిష్కరణల పారిశ్రామిక ఆర్థిక పురోగతి, నాణ్యత ప్రమాణాల మెరుగు, వేగవంతమైన సమాచారంతో ప్రపంచ గమనాన్ని చేరువ చేస్తుందన్నారు. డొమై న్ , హ్యాకింగ్ సవాలను పరిష్కరించడానికి 25 బృందాలుగా విద్యార్థులు ఏర్పడి ఎలా ఎదుర్కోవాలో ప్రదర్శించారు. ఈ కార్యక్రమంలో కోఆర్డినేటర్ డా. హేమలత, సాహిద్ పాల్గొన్నారు.