విశాలాంధ్ర-తాడిపత్రి: గణేష్ నిమజ్జనం సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా దాదాపు 270 మంది పోలీసులతో భారీ బందోబస్తు ఏర్పాటు చేసినట్లు డిఎస్పి జనార్దన్ నాయుడు బుధవారము మీడియా ముఖంగా వెల్లడించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గణేష్ నిమజ్జనానికి తాడిపత్రి చుట్టుపక్కల ప్రాంతంలోని ఆలూరు, ఎర్రగుంటపల్లి, సీమల వాగుపల్లి, కడప జిల్లాలోని సుగమంచిపల్లి గ్రామాల వద్ద గణేష్ నిమజ్జనానికి భారీ క్రేన్లు ఏర్పాటు చేసి పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశామన్నారు. అలాగే మసీదుల వద్ద ఎలాంటి ఘటనలు జరగకుండా పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశామని చెప్పారు.