విశాలాంధ్ర – పెద్దకడబూరు :(కర్నూలు) మండల కేంద్రమైన పెద్దకడబూరు గ్రామంలో లక్ష్మమ్మ అవ్వ దేవాలయం నుండి పోలీసు స్టేషన్ వరకు మెయిన్ రోడ్డుపై డ్రైనేజీలపై అక్రమం కట్టడాలు తొలగించాలని సోమవారం డిప్యూటీ తహసీల్దార్ మహేష్ కు ఎస్సీ సెల్ జిల్లా కార్యదర్శి బొగ్గుల నరసన్న, మేకల రాజు, యువరాజు లు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ డ్రైనేజీ కాలువ దాటి రోడ్డుపై నిర్మాణం చేపట్టడం జరిగిందని తెలిపారు. నిత్యం ప్రజలు, విద్యార్థులు ఎమ్మిగనూరు, మంత్రాలయం, పోలీసు స్టేషన్ కు, పాఠశాలలకు వెళ్తూ ఉంటారని తెలిపారు. దీంతో వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం కలిగి ట్రాఫిక్ సమస్యలు ఏర్పడుతుందన్నారు. కావున అధికారులు స్పందించి అక్రమ కట్టడాలు తొలగించి, నిర్మించిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోరారు.